ETV Bharat / sports

ప్రపంచ రికార్డ్​ సృష్టించిన క్రికెట్​ అభిమానులు - స్టేడియంలో వరల్డ్​కప్​ మ్యాచ్​లను వీక్షించిన 12లక్షల మంది - వన్డే ప్రపంచకప్​ 2023 స్క్వాడ్​

World Cup 2023 Stadium Record : ఈ ఏడాదికిగానూ వన్డే ప్రపంచకప్​ ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నీలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. అలాగే ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ రికార్డు అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అదేంటంటే..

World Cup 2023  Stadium Record
World Cup 2023 Stadium Record
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 2:22 PM IST

Updated : Nov 21, 2023, 3:14 PM IST

World Cup 2023 Stadium Record : భారత్​ వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల ప్రపంచకప్​ ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నీలో 10 జట్లు పాల్గొన్నాయి. హోరా హోరీగా మ్యాచ్​లు జరిగాయి. ఆ మ్యాచ్​లకు భారత్​లోని వివిధ స్టేడియాలు వేదికయ్యాయి. వాంఖడే, అరుణ్​ జైట్లీ, నరేంద్ర మోదీ స్టేడియం ఇలా పలు స్టేడియాలు ఫ్యాన్స్​తో కిక్కిరిసిపోయాయి. ఇండియాతో పాటు ఆయా జట్లకు చెందిన అభిమానులు ఈ మ్యాచ్​లను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి తరలివచ్చారు. టీమ్​ఇండియా ఆడిన మ్యాచ్​లకు రికార్డు స్థాయిలో అభిమానులు స్టేడియాలకు తరలివచ్చారు. అయితే భారత్​ ఆడిన మ్యాచ్​లు మాత్రమే కాకుండా.. నెదర్లాండ్స్, పాకిస్థాన్, వంటి దేశాలు ఆడిన నాన్​ ఇండియా మ్యాచ్​లకు కూడా భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. అయితే తాజాగా ఈ వరల్డ్​ కప్​ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

2019లో జరిగిన ప్రపంచ కప్ టోర్నీకి 10 లక్షల 16 వేల మంది హాజరుకాగా.. ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య మరింత పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగిన మ్యాచ్​లను స్టేడియంలో చూసిన ప్రేక్షకుల సంఖ్య 12 లక్షల 50 వేల 307కు చేరింది. ఇక ఫైనల్ మ్యాచ్‌ని స్టేడియంలో 92,453 మంది వీక్షించారు. అయితే మెల్‌బోర్న్ వేదికగా 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, అత్యధిక మంది వీక్షించిన క్రికెట్ మ్యాచ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ను​ 93,013 మంది వీక్షించారు.

India Vs Australia World Cup 2023 Final : ఇదిలా ఉండగా.. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్​ కప్​ ఫైనల్ పోరులో టీమ్​ఇండియా ఓటమి పాలైంది. ఆసీస్​ ఆరోసారి గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. 2003లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్​లోనూ భారత్​, ఆస్ట్రేలియా తలపడ్డాయి. అప్పుడు కూడా కంగారూలు వరల్డ్​ కప్​ను ఎగరేసుకు పోయారు.

చరిత్ర సృష్టించిన విరాట్​ కోహ్లీ- ఈ వరల్డ్​ కప్​లో నమోదైన రికార్డులివే!

'నిన్న మన రోజు కాదు- మేము మళ్లీ పుంజుకుంటాం'- షమీ ఎమోషనల్ పోస్ట్​!

Last Updated : Nov 21, 2023, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.