ETV Bharat / sports

World Cup 2023 Semi Final Tickets : క్రికెట్ ఫ్యాన్స్​కు అలర్ట్.. ఫైనల్ మ్యాచ్​ టికెట్ల సేల్​ స్టార్ట్​.. మీరు రెడీనా? - 2023 ప్రపంచకప్ సెమీ ఫైనల్ వేదికలు

World Cup 2023 Semi Final Tickets : భారత్​ వేదికగా జరగనున్న 2023 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో.. టోర్నీలోని సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్​ల టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వాటి అమ్మకాలు ఎప్పటినుంచంటే?

2023 World Cup Tickets
2023 World Cup Tickets
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 5:21 PM IST

Updated : Sep 15, 2023, 7:06 PM IST

World Cup 2023 Semi Final Tickets : 2023 ప్రపంచకప్​నకు సమయం దగ్గరపడుతోంది. మెగా టోర్నమెంట్​కు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే టోర్నీలోని లీగ్​ మ్యాచ్ టికెట్ల అమ్మకాన్ని ప్రారంభించిన ఐసీసీ.. మరికొన్ని గంటల్లో నాకౌట్​ మ్యాచ్​ల​ టికెట్లను అమ్మనుంది. ఈ క్రమంలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్​ టికెట్లను కూడా శుక్రవారం (సెప్టెంబర్ 15) రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్​సైట్ (https://tickets.cricketworldcup.com) ​లో అందుబాటులో ఉంచనున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

సెమీ ఫైనల్ మ్యాచ్​లు..

  • సెమీ ఫైనల్-1, నవంబర్ 15 వాంఖడే స్టేడియం (ముంబయి)
  • సెమీ ఫైనల్-2, నవంబర్ 16 ఈడెన్ గార్డెన్స్ (కోల్​కతా)

ఫైనల్..

  • నవంబర్-19, నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)

Golden Ticket World Cup 2023 : అయితే వరల్డ్ కప్​లో బీసీసీఐ..'గోల్డెన్ టికెట్స్​ ఫర్ ఇండియా ఐకాన్స్​' అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా భారతరత్న సచిన్ తెందూల్కర్​, బాలీవుడ్ బిగ్​బి అమితాబ్​ బచ్చన్​కు బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ గోల్డెన్ టికెట్ అందజేశారు. అయితే ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న వారు, ప్రపంచకప్​లోని అన్ని మ్యాచ్​లను స్టేడియంలో ప్రత్యక్షంగా.. వీఐపీ బాక్స్​లో కూర్చొని వీక్షించవచ్చు. అంతేకాకుండా ఈ టికెట్​పై.. వారికి వీఐపీ వసతులన్నింటినీ కల్పిస్తారు. ఈ క్రమంలో సచిన్, అమితాబ్​కు ఈ టికెట్ అందింది. ఇక మున్ముందు ఈ గోల్డెన్ టికెట్లను దేశంలోని ఆయా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

World Cup 2023 Inaugural Match : అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచకప్​నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్​ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెగా టోర్నీ డిఫెండింగ్​ ఛాంపియన్​ ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మ్యాచ్​తో ప్రారంభం కానుంది. ఈ పోరుకు అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదిక కానుంది.

Team India Squad For World Cup 2023 : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్​ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జన్​ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్​దీప్ యాదవ్.

Last Updated : Sep 15, 2023, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.