World Cup 2023 Pakistan : ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో పాకిస్థాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు కేవలం రెండు గెలుపులతోనే నెట్టుకుంటూ వచ్చిన పాక్ జట్టు.. తాజాగా జరిగిన మ్యాచ్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఆరు పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో ఐదో స్థానానికి ఎగబాకి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. దీంతో పాక్ జట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే ఇప్పటికీ ఆ జట్టు సెమీస్ చేరుకోవాలంటే దాని కోసం చాలా కష్టపడాల్సి ఉంది.
రానున్న రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ భారీ విజయాలు సాధించాల్సి ఉంది. అయితే ఆ రెండు మ్యాచుల్లో పాక్.. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో తలపడాల్సి ఉంది. అయితే అది సాధ్యపడే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకుల మాట. ఒకవేళ ఈ రెండు జట్లను పాక్ ఓడించిప్పటికీ పలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. ఈ రెండింట్లో ఏదో ఒక జట్టు అఫ్గానిస్థాన్ ఓడించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, శ్రీలంకలు కలిసి న్యూజిలాండ్‌ను ఓడించాలి. ఇక టీమ్ఇండియా.. శ్రీలంక,నెదర్లాండ్స్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగాక కూడా పాకిస్థాన్ సెమీస్‌కు చేరడం అంత సులువైన పని కాదనిపిస్తుంది. ఒకవేళ పైన అనుకున్నట్లు జరిగినా కూడా పాక్.. కివీస్, ఇంగ్లాండ్‌లపై భారీ విజయాలు సాధించడమనేది సాధ్యపడకపోవచ్చు. దీంతో ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపు లేనట్లే అనిపిస్తోంది.
మరోవైపు ప్రస్తుతం భారత్, సౌతాఫ్రికాలు సెమీస్ రేసులో టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. భారత్ 6 మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచి టేబుల్ టాపర్‌గా ఉండగా.. సౌతాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో ఐదు గెలిచి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు కూడా చెరో 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి వరుసగా 3, 4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే పాక్‌తో పోలిస్తే ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న అఫ్గానిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించింది.
సెమీస్ అవకాశాలు ఏ జట్టుకు ఎంత శాతం ఉన్నాయంటే..
భారత్ | 99.9% |
సౌతాఫ్రికా | 95% |
న్యూజిలాండ్ | 75% |
ఆస్ట్రేలియా | 74% |
అఫ్గానిస్థాన్ | 31% |
పాకిస్థాన్ | 13% |
శ్రీలంక | 6% |
నెదర్లాండ్స్ | 5.8% |
ఇంగ్లాండ్ | 0.3% |
-
The return of @iShaheenAfridi's first-over wicket, @FakharZamanLive's attacking masterclass and more 🏏🌟
— Pakistan Cricket (@TheRealPCB) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Stars of the #PAKvBAN win in conversation 🎙️#CWC23 | #DattKePakistani pic.twitter.com/FAjmHJbXKm
">The return of @iShaheenAfridi's first-over wicket, @FakharZamanLive's attacking masterclass and more 🏏🌟
— Pakistan Cricket (@TheRealPCB) November 1, 2023
Stars of the #PAKvBAN win in conversation 🎙️#CWC23 | #DattKePakistani pic.twitter.com/FAjmHJbXKmThe return of @iShaheenAfridi's first-over wicket, @FakharZamanLive's attacking masterclass and more 🏏🌟
— Pakistan Cricket (@TheRealPCB) November 1, 2023
Stars of the #PAKvBAN win in conversation 🎙️#CWC23 | #DattKePakistani pic.twitter.com/FAjmHJbXKm
PAK vs BAN WORLD CUP 2023 : పుంజుకున్న పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై ఘన విజయం