ETV Bharat / sports

భారత బౌలర్లు భళా.. కీలక మ్యాచ్​లో మిథాలీ సేన ఘన విజయం

author img

By

Published : Mar 22, 2022, 1:07 PM IST

World Cup 2022: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్​ 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​లో యస్తికా భాటియా అర్ధశతకంతో రాణించగా.. బౌలింగ్​లో స్నేహ్​ రాణా 4 వికెట్లు తీసింది.

WOMENS WORLD CUP 2022
భారత మహిళల జట్టు

World Cup 2022: మహిళల ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో భారత్​ రెచ్చిపోయింది. బంగ్లాదేశ్​తో జరిగిన పోరులో ఇండియా 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​లో మోస్తరుగానే పరుగులు చేసినప్పటికీ.. బౌలింగ్​లో సత్తా చాటింది. 119 పరుగులకే బంగ్లాను కట్టడి చేసింది.

టాస్‌నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. దీంతో బంగ్లాకు 230 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యస్తిక భాటియా (50) అర్ధశతకంతో రాణించింది. మిగతా బ్యాటర్లలో స్మృతి మంధాన 30, షఫాలీ వర్మ 42, హర్మన్‌ కౌర్ 14, రిచా ఘోష్ 26, స్నేహ్ రాణా 27, పూజా వస్త్రాకర్‌ 30*, జులన్‌ గోస్వామి 2* పరుగులు చేశారు. మిథాలీ రాజ్‌ సున్నాకే వెనుదిరిగింది. బంగ్లా బౌలర్లలో రితు మోని 3, నహిదా 2, జహనర అలమ్​ ఒక వికెట్ తీశారు.

230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్​ బ్యాటర్లను భారత బౌలర్లు దెబ్బతీశారు. 12 పరుగుల వద్ద తొలి వికెట్​ కోల్పోయిన బంగ్లా.. ఏ దశలోనూ పోటీనివ్వలేదు. వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. భారత బౌలర్​ స్నేహ్​ రాణా 4 వికెట్లతో భారత గెలుపులో కీలక పాత్ర పోషించింది. పూజా వస్త్రాకర్​, జులన్​ గోస్వామి తలో 2 వికెట్లు తీయగా, రాజేశ్వరి గైక్వాడ్​ ,పూనమ్​ యాదవ్​ ఒక్కో వికెట్​ పడగొట్టారు.

ఇదీ చదవండి: World Cup 2022: రాణించిన యస్తికా భాటియా.. బంగ్లా లక్ష్యం ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.