ETV Bharat / sports

Smriti Mandhana: 'స్మృతి మంధాన చాలా డేంజరస్​' - ఎలిస్ పెర్రీ

Smriti Mandhana: టీమ్​ఇండియా మహిళల జట్టు డాషింగ్ బ్యాటర్​ స్మృతి మంధాన చాలా డేంజరస్​ అని చెప్పింది ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ ఎలిస్ పెర్రీ. మహిళల ప్రపంచకప్​లో భాగంగా శుక్రవారం భారత్​తో తలపడనున్న నేపథ్యంలో స్మృతి, హర్మన్​ప్రీత్​ కౌర్​లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పెర్రీ.

Smriti Mandhana
స్మృతి మంధాన
author img

By

Published : Mar 16, 2022, 5:57 AM IST

Smriti Mandhana: టీమ్​ఇండియా ప్రమాదకర ద్వయం పట్ల తమ జట్టు అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పింది ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ ఎలిస్ పెర్రీ. 2022 మహిళల ప్రపంచకప్​లో భాగంగా భారత్​తో మార్చి 18న తలపడనుంది ఆసీస్. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పెర్రీ.. స్మృతి, కౌర్​లను ప్రశంసిస్తూనే.. వారితో పోటీని ఆస్వాదిస్తామని చెప్పింది.

Smriti Mandhana
స్మృతి, హర్మన్​ప్రీత్​

"టీమ్​ఇండియా బ్యాటింగ్​ ​లైనప్​లో ఉన్న పవర్​ గురించి అవగాహన ఉంది. స్మృతి, హర్మన్​ప్రీత్​ కచ్చితంగా చాలా డేంజరస్​ బ్యాటర్లు. ఇద్దరూ ఆస్ట్రేలియాలో బిగ్​బాష్​ లీగ్​ ఆడారు. ఆ టోర్నీలో సెంచరీలు బాదినట్టు ఉన్నారు. మేము పరస్పరం చాలా మ్యాచ్​లు ఆడాం. కాబట్టి భారత్​తో మ్యాచ్​ కోసం ఎలా సన్నద్ధమవ్వాలో తెలుసు. వారితో మ్యాచ్​ సవాలే. మా మధ్య పోరు గొప్పగా ఉండబోతోంది."

-ఎలిస్ పెర్రీ, ఆస్ట్రేలియా ఆల్​రౌండర్

అయితే కంగారు జట్టు కన్నా ముందే మార్చి 16న ఇంగ్లాండ్​ను ఢీకొననుంది భారత్. ఇక అంతకుముందు శనివారం వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై 155 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్​లో స్మృతి మంధాన(123), హర్మన్​ ప్రీత్​ కౌర్​(109) శతకాలతో రాణించారు.

ఇదీ చూడండి: అదరగొట్టిన అమ్మాయిలు.. విండీస్​పై భారీ విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.