ETV Bharat / sports

ప్రపంచకప్​లో తొలి పోరుకు మిథాలీ సేన సిద్ధం- పాక్​పై ఆధిపత్యమేనా? - womens world cup india pakistan latest news

women's world cup 2022: మహిళల ప్రపంచకప్​కు భారత జట్టు సిద్ధమైంది. తొలి మ్యాచ్​లో భాగంగా దాయాది పాకిస్థాన్​తో తలపడనుంది మిథాలీ సేన. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

India women
భారత మహిళల జట్టు
author img

By

Published : Mar 5, 2022, 7:47 PM IST

women's world cup 2022: మహిళల ప్రపంచకప్​లో భారత్​ తొలి పోరుకు సమయం ఆసన్నమైంది. ఎప్పుడో 1973లో టోర్నీ ప్రారంభమైనా.. భారత జట్టును వరల్డ్​ కప్​ ఇంకా అందని ద్రాక్ష లాగే ఊరిస్తోంది. ఏళ్లనాటి కలను సాకారం చేసుకుని ప్రపంచకప్​ను ముద్దాడేందుకు సిద్ధమైంది మిథాలీసేన. ఈ క్రమంలో తొలి మ్యాచ్​లోనే దాయాది పాకిస్థాన్​తో తలపడనుంది భారత జట్టు.

ఇప్పటివరకు రెండు సార్లు ఫైనల్లో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. ఈ సారి కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. ఎన్నో ఆశలతో నెలరోజుల ముందే న్యూజిలాండ్ చేరుకుంది భారత జట్టు. కెప్టెన్ మిథాలీ రాజ్​, దిగ్గజ బౌలర్ జులన్ ఘోస్వామిలకు ఇదే చివరి వరల్డ్​కప్​. రెండు వార్మప్​ మ్యాచ్​ల్లోనూ బౌలర్లు కొంచెం తడబడ్డా.. బ్యాటర్లు​ మాత్రం పర్వాలేదనిపించారు.

బలా బలాలేంటి..

దిగ్గజ బౌలర్ గోస్వామి మంచి ఫామ్​లో కొనసాగుతుండగా.. మిగతా బౌలర్లు మేఘనాసింగ్, పూజా వస్త్రాకర్​, రేణుకసింగ్​లు బౌలింగ్​లో ఎలా రాణిస్తారో చూడాలి. స్పిన్నర్​ దీప్తి శర్మ.. ప్రస్తుతం అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్​గా కొనసాగుతోంది. ఇక మరో బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్​ వార్మప్​ మ్యాచ్​ల్లో పర్వాలేదనిపించింది.

ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు మంచి ఫామ్​లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్మృతి మంధాన దూకుడుగా ఆడగలదు, అవసరమైతే సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూ ఎక్కువ సేపు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను నిర్మించగలదు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో మెరుపు ఆరంభాలనిచ్చే యువ షెఫాలీ వర్మ కూడా జట్టులో ఉండడం భారత్‌కు బలం. ఆమె సామర్థ్యం మేరకు రాణిస్తే భారత్‌కు తిరుగుండదనడంలో సందేహం లేదు.

ఇక అత్యంత అనుభవజ్ఞురాలైన కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకలా నిలుస్తుంది. ఆమె రికార్డు చూస్తేనే అది అర్థమవుతుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లో మూడు అర్ధశతకాలు సాధించిన ఆమె.. గతంలో కంటే వేగంగా పరుగులు రాబట్టింది.

మిడిలార్డల్​లో హర్మన్‌ప్రీత్‌..

21 ఏళ్ల యాస్తిక భాటియా కూడా బ్యాటుతో ఆశలు రేపుతోంది. మిడిల్‌ ఆర్డర్‌లో హర్మన్‌ప్రీత్‌ లాంటి బ్యాటర్‌ ఉండడం భారత్‌కు సానుకూలాంశమే. అయితే ఆమె ఫామ్‌ను అందుకోవడం ముఖ్యం. అనుభవజ్ఞురాలైన దీప్తి శర్మ, వికెట్‌కీపర్‌ రీచా ఘోష్‌ కూడా ఉన్న భారత బ్యాటింగ్‌ లైనప్‌కు జట్టు స్కోరును 270 దాటించే సత్తా ఉంది. ఈ బ్యాటింగ్‌ దళం సమష్టిగా రాణిస్తే ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు.

ఇక ​టోర్నీలోని ర్యాంకుల్లో పాకిస్థాన్ అత్యల్ప స్థాయిలో ఉంది. వరల్డ్​కప్​లో ఈసారి ఎలాగైనా నాకౌట్​ దశ చేరుకోవాలని తహతహలాడుతోంది. అయితే బిస్మా మరూఫ్ సేన మాత్రం వార్మప్ మ్యాచ్​ల్లో వరుస విజయాలు సాధించింది. టాప్​ ఆర్డర్​పైనే ఆశలన్నీ పెట్టుకుంది పాక్ జట్టు.

భారత్​ స్వ్కాడ్​..

మిథాలీరాజ్(కెప్టెన్​), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్​ప్రీత్ కౌర్, యస్తిక భాటియా, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్, రిచ్​ఘోష్​(వికెట్​ కీపర్​), తనియా భాటియా, స్నేహ్ రానా, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్​, పూనమ్ యాదవ్​, జులన్​ గోస్వామి, రేణుక సింగ్​.

పాక్​ స్క్వాడ్​..

అలియా రియాజ్, జవేరియా ఖాన్​, మునీబా అలీ, నషిదా ఖాన్​, బిస్మా మరూఫ్(కెప్టెన్​), సిద్రా అమీన్, నిదా దర్​, అనమ్​ అమిన్​, ఒమైమా సోహేల్, సిద్రా నవాజ్​, అయిమాన్​ అన్వర్​, దియానా బెయిగ్​, ఫాతిమా సనా, గులామ్​ ఫాతిమా, నష్రా సంధూ.

మ్యాచ్ సమయం- ఉదయం 6:30 గంటలకు

ఇదీ చూడండి: రెండో రోజూ మనదే.. తొలి ఇన్నింగ్స్​లో లంక 108/4

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.