ప్రపంచకప్ ఎలా గెలవాలో అండర్-19 అమ్మాయిలు చూపించారు. ఇప్పుడు భారత సీనియర్ల వంతు వచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్‌కు సమయం ఆసన్నమైంది. ఇంకో నాలుగు రోజుల్లో ఈ మెగా టోర్నీ ఆరంభంకానుంది. అండర్-19 ప్రపంచకప్ జరిగిన దక్షిణాఫ్రికా వేదికగానే షురూ కాబోతున్న ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ కప్పు వేటకు సిద్ధమైంది. మరి ఈ టోర్నీ వివరాలేంటో చూద్దామా..
ఎప్పటి నుంచి?: ఫిబ్రవరి 10న ఆరంభమవుతుంది. 26న ఫైనల్ జరుగుతుంది.
వేదికలు: కేప్‌టౌన్, గెబెరా, పార్ల్.
జట్లు.. గ్రూప్‌లు?: 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి టోర్నీ నిర్వహించనున్నారు.
గ్రూప్-1: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక; గ్రూప్-2: భారత్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్
ఎలా..?: రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
భారత్ ఈసారైనా..: మహిళల క్రికెట్లో ఇది ఎనిమిదో టీ20 ప్రపంచకప్. గత ఏడు టోర్నీల్లో ఆస్ట్రేలియా అయిదుసార్లు విజేతగా నిలవగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ చెరో కప్ నెగ్గాయి. 2020లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లినా ఆసీస్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఫిబ్రవరి 12న పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది.
ఇదీ చూడండి: World Test Championship: రోహిత్‌కు 'టెస్టు'.. టీమ్‌ను ఎలా నడిపిస్తాడో?