టీ20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా జరిగిన టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టుకు నిరాశ ఎదురైంది. ట్రై సిరీస్ ఫైనల్లో 110పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ టీమ్ 18ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. లీగ్ దశలో మంచి ప్రదర్శన చేసిన భారత జట్టు చివర్లో పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో పరాజయాన్ని అందుకుంది. ఫలితంగా ఈ ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా మహిళలు విజేతలుగా నిలిచారు.
లక్ష్య ఛేదనలో మొదట దక్షిణాఫ్రికా 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా... 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' నిలిచిన క్లో ట్రైఆన్ (32 బంతుల్లో 57*; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుతంగా ఆడి జట్టుకు విజయన్ని అందించింది. నదిన్ డి క్లర్క్(17) ఆమెకు అండగా నిలిచింది. స్నేహ్ రాణా 2 వికెట్లు తీసింది. రేణుకా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు.
కాగా, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేసింది. సఫారీ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత టాప్– బ్యాటర్లంతా విఫలమయ్యారు. స్మృతి మంధాన (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (11) రన్స్ మాత్రమే చేసింది. హర్లీన్ డియోల్ (56 బంతుల్లో 46; 4x4) టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (22 బంతుల్లో 21; 2x4) నిరాశపర్చింది. చివర్లో దీప్తి శర్మ (14 బంతుల్లో 16 *) చేసింది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. ఈ నెల 10 నుంచి దక్షిణాఫ్రికా గడ్డపైనే మహిళల టీ20 వరల్డ్ కప్ జరగనుంది.
ఇదీ చూడండి: వారసుడు వచ్చేశాడు!.. విరాట్ తర్వాత అతడేనా?