ETV Bharat / sports

Women's Day 2022: దేశం గర్వించదగ్గ క్రీడామణులు.. బరిలోకి దిగితే శివంగులు - అవని లేఖరా

Women's Day 2022: సాధారణంగా క్రీడలంటే పురుషులే గుర్తుకొస్తారు. కానీ వారితో పోల్చితే తామేమి తక్కువ కాదంటూ సత్తా చాటుతున్నారు ఈ భారత క్రీడామణులు. వారు మైదానంలోకి దిగితే శివంగులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి8) సందర్భంగా వారి గురించి తెలుసుకుందామా?

women sports personalities
దేశం గర్వించదగ్గ క్రీడామణులు..బరిలోకి దిగితే శివంగులు..
author img

By

Published : Mar 8, 2022, 6:01 AM IST

Women's Day 2022: ఎన్నో ఆంక్షలు. మరెన్నో కట్టుబాట్లు. అన్నింటినీ అధిగమించి.. క్రీడా ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రీడామణులు ఎందరో.. మరి ప్రపంచ మహిళాదినోత్సవం( మార్చి 8)వేళ జీవనసమరంలో జయించి.. కోట్లమంది యువతలో స్ఫూర్తిని నింపిన వారి గురించి తెలుసుకుందామా..?

క్రికెట్​ ప్రపంచంలో ఎదురులేని శక్తిగా..

భారత మహిళా క్రికెట్​లోనే గొప్ప క్రికెటర్​ మిథాలీ రాజ్​. రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్​ ఆడుతున్న ఆమె ఎన్నో ఘనతల్ని అందుకున్నారు. 39 ఏళ్ల ఈ బ్యాటర్​ వన్డే ప్రపంచకప్​లో రెండు సార్లు భారత్​ను ఫైనల్స్​కు తీసుకెళ్లారు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్​గా రికార్డు నెలకొల్పారు.

Mithali raj
మిథాలీ రాజ్​

అంతర్జాతీయ మహిళల క్రికెట్​లో 7,000 పరుగులు చేసిన మిథాలీ.. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​గా రికార్డు సృష్టించారు. దీంతోపాటు వన్డేల్లో వరుసగా ఏడు అర్థ శతకాలు చేసిన బ్యాటర్​గా ఘనత వహించారు. భారత్ తరఫున టీ20ల్లో 2,000 పరుగులు చేసిన మిథాలీ.. అంతర్జాతీయంగాను ఈ రికార్డును సృష్టించిన తొలి క్రికెటర్​గా ఘనత సాధించారు. వన్డేల్లో దృష్టి సారించేందుకు మిథాలీ 2019లో టీ20ల నుంచి తప్పుకున్నారు.

ఎన్నో రికార్డులు సృష్టించిన మిథాలీ రాజ్​ భారత ప్రభుత్వం నుంచి అనేక అవార్డులను పొందారు. 2003లో అర్జున, 2015లో పద్మశ్రీ, 2017లో విస్డెన్​ వుమెన్​ క్రికెటర్​ అవార్డు, 2021లో మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్న ఆవార్డులు ఆమెను వరించాయి.

వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్​లో..

భారతదేశంలోని ఫిట్​నెస్​ గల అథ్లెట్లలో పీవీ సింధు ఒకరు. భారత త్రివర్ణ పతాకాన్ని ఒలింపిక్స్​ సహా అనేక ఈవెంట్లలో రెపరెపలాడించారు. భారత్​ తరఫున బ్యాడ్మింటన్​ వరల్డ్​ ఛాంపియన్​షిప్​తో పాటు ఒలింపిక్స్​లో వరుసగా రెండు సార్లు పతకాలు సాధించిన అథ్లెట్​గా రికార్డు సృష్టించారు. దీంతో పాటు 2018లో జరిగిన కామన్​వెల్త్​, ఆసియా గేమ్స్​లో రెండు రజత పతకాలు, ఉబర్​ కప్​లో రెండు కాంస్య పతకాల్ని సాధించారు.

PV Sindhu
పీవీ సింధు

భారత మూడో అత్యుత్తమ పౌర పురస్కారం పద్మ భూషణ్​తో పాటు పద్మశ్రీ, అర్జున, మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్న అవార్డులను కైవసం చేసుకున్నారు

బాక్సింగ్​లో ఆల్వేస్ కింగ్​.. ​

భారత్ బాక్సింగ్​లోకి ఆలస్యంగా అడుగుపెట్టినా గెలవాలనే తపనతో తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలను అందుకున్నారు మేరీకోమ్​. 2001లో ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్స్​లో తొలిసారి పాల్గొన్న ఆమె రజత పతకాన్ని సాధించారు.

MaryKom
మేరీకోమ్​

ఆరు ప్రపంచ ఛాంపయన్​షిప్స్​ సాధించిన ఆమె 2002లో తొలి బంగారు పతకాన్ని గెలుపొందారు. ఐర్లాండ్​కు చెందిన కేటీ టేలర్​ ఐదు సార్లు ప్రపంచకప్ పొందిన రికార్డును తిరగరాసిన ఆమె.. చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బాక్సర్​గా రికార్డు సృష్టించారు. 2012 లండన్ ఒలింపిక్స్​లో కాంస్యం గెలుచుకున్న ఆమె మొత్తం 8 పతకాలను సాధించారు.

దీంతో బాక్సింగ్​ చరిత్రలో పురుషుల, మహిళల కేటగిరీలో ఎవరు సాధించని రికార్డును సృష్టించారు. 2014 ఆసియా గేమ్స్​, కామన్​వెల్త్​ గేమ్స్​లో బంగారు పతకాలు సాధించిన ఆమె ఈ ఘనత వహించిన తొలి భారత బాక్సర్​గా రికార్డు సృష్టించారు. ఆసియా గేమ్స్​లో మేరీకోమ్​ ఐదుసార్లు గెలిచారు. ​

పారాలింపిక్స్​లో అత్యుత్తమ అథ్లెట్..

అవని లేఖరా భారత పారాలింపిక్స్​లో అత్యుత్తమ అథ్లెట్​. అనేక సందర్భాల్లో దేశం గర్వపడేలా చేశారు అవని లేఖరా. మహిళల 10 మీటర్ల ఏయిర్​ రైఫిల్​ విభాగంలో ప్రపంచంలోనే రెండో స్థానాన్ని సాధించారు. 2020 టోక్యో పారాలింపిక్స్​ 10 మీటర్ల విభాగంలో బంగారు పతకం, 50 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

Avani Lekhara
అవని లేఖరా

భారత తరఫున పారాలింపిక్​లో గోల్డ్​ మెడల్​ సాధించిన మహిళగా రికార్డు సృష్టించారు. 2020 సమ్మర్​ పారాలింపిక్స్​లో 249.6 పాయింట్లతో బంగారు పతకాన్ని గెలిచారు. దీంతో పారాలింపిక్​ రికార్డ్​, ప్రపంచ రికార్డులను సమం చేశారు. 2021లో ఖేల్​రత్న, 2022లో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.

మణిపుర్​ మణిహారం..

మణిపుర్​కు చెందిన సైకోమ్​ మీరాబాయి​ చాను రజతం గెలవడం వల్ల భారత్​ టోక్యో ఒలింపిక్స్​ను ప్రారంభించింది. 49 కేజీల లిఫ్టింగ్​ విభాగంలో ఈ పతకాన్ని గెలుచుకున్నారు. వరల్డ్​ ఛాంపియన్​షిప్​, కామన్​వెల్త్​లో బంగారు పతకాలు గెలిచినా..రియో ఒలింపిక్స్​లో నిరాశపరిచారు.

Meera  Bhai Chanu
మీరాబాయి​ చాను

28ఏళ్ల చాను 2014లో కామన్​వెల్త్​లో 48కేజీల విభాగంలో రజతాన్ని గెలిచారు. 2016 రియో ఒలింపిక్స్​లో నిరాశపరిచిన చాను 2017 ప్రపంచ ఛాంపియన్​షిప్​ని గెలిచి తిరిగి పుంజుకున్నారు. ఒలింపిక్స్​లో వేయిట్​ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన మహిళగా రికార్డు సృష్టించారు. కరణం మల్లీశ్వరి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డు సృష్టించారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్​లో కరణం మల్లీశ్వరి కాంస్యం గెలిచింది.

భారత్​కు ఎన్నో విజయాలను అందించిన ఈ క్రీడాకారులు ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళలు ఏదైనా సాధించగలరన్న ఆత్వవిశ్వాసాన్ని నింపుతున్నారు.

ఇదీ చదవండి: యువ ప్లేయర్ల కోసం మేరీకోమ్​ త్యాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.