ETV Bharat / sports

మహిళల ఆసియా కప్‌.. థాయ్​లాండ్​పై విజయం.. ఫైనల్‌కు భారత్‌ - asiacup teamindia final

Womens Asia cup Final Teamindia
మహిళల ఆసియా కప్‌.. ఫైనల్‌కు భారత్‌
author img

By

Published : Oct 13, 2022, 11:31 AM IST

Updated : Oct 13, 2022, 11:37 AM IST

11:30 October 13

మహిళల ఆసియా కప్‌.. ఫైనల్‌కు భారత్‌

మహిళల ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియా ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకుంది. థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీస్‌-1 మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 148 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో థాయ్‌లాండ్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులే చేసింది. భారత బౌలర్లలో దీప్తీ శర్మ 3, రాజేశ్వరి గైక్వాడ్‌ 2, రేణుకా సింగ్‌, స్నేహా రాణా, షఫాలీ ఒక్కో వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన థాయ్‌లాండ్‌ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ప్రత్యర్థికి 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదన ఆరంభించిన థాయ్‌ జట్టును భారత బౌలర్‌ దీప్తి శర్మ ఆరంభంలోనే బోల్తా కొట్టించింది. మూడో ఓవర్లో దీప్తి వేసిన ఐదో బంతిని ఓపెనర్‌ కొంచారోయింకై షాట్‌కు ప్రయత్నించగా.. షఫాలీ వర్మ అద్భుతమైన క్యాచ్‌ పట్టింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మరో మూడు వికెట్లను కోల్పోయిన థాయ్‌ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత నరూమోల్‌ చైవై, నట్టాయ బూచతమ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. భారత బౌలర్ల ధాటికి థాయ్‌ వికెట్ల పతనం ఆగలేదు. ఈ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 74 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌ అలవోకగా ఫైనల్‌కు చేరుకుంది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. రాజేశ్వరీ గైక్వాడ్‌ 2, రేణుకా సింగ్‌, స్నేహ్‌ రాణా, షఫాలీ వర్మ చెరో వికెట్ సాధించారు.

షఫాలీ సూపర్​.. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ(42) రాణించింది. 150 స్ట్రైక్‌ రేట్‌తో 5 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఆ తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, జెమిమా రోడ్రిగ్స్‌ కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. 20 ఓవర్లకు భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు సాధించింది. థాయ్‌ జట్టులో సొర్నరిన్‌ టిప్పొచ్‌ 3 వికెట్లు పడగొట్టింది. ఫన్నిటా మాయ, తిప్పట్చ పుత్తువాంగ్‌, నట్టాయ బూచతమ్‌కు చెరో వికెట్ దక్కింది.

Last Updated : Oct 13, 2022, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.