ETV Bharat / sports

'అది మా నాన్న కల.. ఆయన ఉంటే బాగుండు'

బీసీసీఐ నుంచి తొలి పిలుపు రావడంపై భావోద్వేగానికి గురయ్యాడు యువ బౌలర్​ చేతన్ సకారియా. ఏడాది కాలంలోనే తన జీవితంలో చాలా ఎత్తుపల్లాలను చూశానని వెల్లడించాడు.

chetan sakariya, cricketer
చేతన్​ సకారియా, యువ క్రికెటర్
author img

By

Published : Jun 11, 2021, 5:29 PM IST

శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కడంపై ఎమోషనల్​గా స్పందించాడు యువ బౌలర్​ చేతన్ సకారియా. ఇటీవల తన జీవితంలో ఎదురైన ఒడుదొడుకులను తలుచుకొని భావోద్వేగానికి గురయ్యాడు.

"ఎన్నటికైనా టీమ్​ఇండియాకు ఆడాలన్నది మా నాన్న కల. అది నేడు నెరవేరబోతోంది. కానీ, ఇది చూడటానికి మా నాన్న ఇక్కడ లేరు. ఈ రోజు ఆయనను చాలా మిస్ అవుతున్నా."

-చేతన్ సకారియా, యువ క్రికెటర్.

"నా సోదరుడిని కోల్పోయిన ఒక నెలకే నాకు ఐపీఎల్​ కాంట్రాక్టు వచ్చింది. మా నాన్న చనిపోయిన ఒక నెల తర్వాత ఇప్పుడు టీమ్ఇండియాకు ఆడే అవకాశం వచ్చింది. ఇది నా జీవితంలో పూడ్చలేని లోటు. మా నాన్న కోసం నేను ఆస్పత్రిలో వారం రోజుల పాటు ఉన్నా. నా క్రికెట్​ కెరీర్​కు కృషి చేసిన మా తండ్రితో పాటు మా అమ్మకు ఇది అంకితం" అని సకారియా భావోద్వేగంతో చెప్పాడు.

ఐపీఎల్​ ద్వారా వెలుగులోకి వచ్చిన సకారియా.. లీగ్​లో గొప్ప ప్రదర్శనే చేశాడు. రాజస్థాన్​ తరఫున ఆడిన ఈ యువ బౌలర్.. 7 మ్యాచ్​ల్లో 7 వికెట్లు తీశాడు.

ఇదీ చదవండి: WTC Final: 'ఆ స్థానంలో నా ఓటు శార్దుల్​కే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.