ETV Bharat / sports

T20 Worldcup: విండీస్​​ హెడ్​కోచ్​ రాజీనామా.. కారణమిదే - టీ20 ప్రపంచకప్​ ఫిల్ సైమన్స్​ రాజీనామా

వెస్టిండీస్ హెడ్‌ కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన పదవికి రాజీనామా చేశాడు. ఎందుకంటే..

Phil Simmons to quit following T20 WC debacle
T20 Worldcup: విండీస్​​ హెడ్​కోచ్​ రాజీనామా.. కారణమిదే
author img

By

Published : Oct 25, 2022, 10:28 AM IST

Updated : Oct 25, 2022, 10:41 AM IST

వెస్టిండీస్ హెడ్‌ కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ 2022లో విండీస్‌ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ సిమన్స్‌ తన హెడ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది అఖరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ అనంతరం సిమన్స్ తన బాధ్యతలు నుంచి తప్పుకోనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని విండీస్‌ క్రికెట్‌ బోర్డు కూడా ప్రకటించింది.

"వెస్టిండీస్‌ అనేది కేవలం ఒక జట్టు మాత్రమే కాదు. కొన్ని దేశాల కలయిక. టీ20 ప్రపంచకప్‌లో మా జట్టు ప్రదర్శన అభిమానులకు నిరాశ కలిగించింది. మేము ఈ టోర్నీలో మా స్థాయికి తగ్గట్టు రాణించలేదు. ఇందుకు కరీబియన్‌ అభిమానులకు, మద్దతుదారులకు క్షమాపణలు కోరుతున్నాను. ఇక ఆస్ట్రేలియాతో టెస్ట్ అనంతరం వెస్టిండీస్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను స్వయంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఆస్ట్రేలియా గడ్డపై మా జట్టు టెస్టు సిరీస్‌ కైవసం చేసుకునేలా నేను ప్రయత్నిస్తాను" అని సిమన్స్‌ పేర్కొన్నాడు. కాగా 2016లో టీ20 ప్రపంచకప్‌ను విండీస్‌ కైవసం చేసుకోవడంలో సిమన్స్‌ కీలక పాత్ర పోషించాడు.

క్వాలిఫైయింగ్ దశ కూడా.. ఈ ఏడాది ప్రపంచకప్‌లో కరీబియన్ జట్టు కనీసం క్వాలిఫైయింగ్ దశను కూడా దాటలేకపోయింది. రౌండ్‌-1లో విండీస్‌ దారుణంగా విఫలమైంది. ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ లాంటి వంటి చిన్న జట్ల చేతిలో కూడా ఘోర ఓటమిని చవిచూసింది.

ఇదీ చూడండి: T20 worldcup: టీమ్​ఇండియాకు తప్పిన టెన్షన్​.. అలా చేస్తే సెమీస్​ బెర్త్​ ఖాయం!

Last Updated : Oct 25, 2022, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.