ETV Bharat / sports

అశ్విన్​​ ఫస్ట్​బెంచ్​​ స్టూడెంట్:​ జాఫర్ - wasim jaffers wtc final meme trolling

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(World Championship Final) మ్యాచ్​కు సంబంధించిన విధి విధానాలను ఐసీసీ విడుదల చేసింది. దీనిపై టీమ్​ఇండియా మాజీ బ్యాట్స్​మన్ వసీమ్​ జాఫర్ తనదైన శైలిలో ఓ మీమ్​ ద్వారా స్పందించి ​అందరినీ ఆకట్టుకున్నాడు. అశ్విన్‌ను ఫస్ట్‌బెంచ్‌ స్టూడెంట్‌గా అభివర్ణిస్తూ ట్రోల్​ చేశాడు.

Ashwin
అశ్విన్​​
author img

By

Published : May 29, 2021, 8:58 AM IST

టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌, రంజీ క్రికెట్‌ పరుగుల వీరుడు వసీమ్‌ జాఫర్‌ ఇటీవల ఏ సందర్భాన్నీ వదలడం లేదు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సందర్భోచితంగా ఏ విషయం మీదైనా, ఎవరి మీదైనా ఇట్టే ఆకట్టుకునే మీమ్స్‌తో ఛలోక్తులు విసురుతూ నెటిజెన్లను అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ.. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌(wtc final) మ్యాచ్‌కు సంబంధించిన విధి విధానాలను విడుదల చేయగా, జాఫర్‌ తనదైన శైలిలో స్పందించాడు.

jafar
జాఫర్

ప్రముఖ బాలీవుడ్‌ సినిమా 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌'లోని ఓ సన్నివేశంలో హీరో సంజయ్‌ దత్‌(sanjay dutt) తరగతి గది నుంచి బయటకు వెళుతూ తన రూమ్మేట్‌ను పాఠం అర్థం చేసుకోమని, తర్వాత దాన్ని తనకు అర్థమయ్యేలా చెప్పమనే డైలాగ్‌ ఉంటుంది. అయితే, ఐసీసీ ట్వీట్‌కు ఆ సన్నివేశానికి తగ్గ మీమ్‌తో జాఫర్‌.. 'టీమ్‌ఇండియా పరిస్థితి ఇది' అని, రవిచంద్రన్‌ అశ్విన్‌ను(ravichandran aswin) ఫస్ట్‌బెంచ్‌ స్టూడెంట్‌గా అభివర్ణిస్తూ.. ట్రోలింగ్‌ చేశాడు.

అతడి ఉద్దేశం ఏమిటంటే.. ఐసీసీ(ICC) విడుదల చేసిన ఛాంపియన్‌షిప్‌ విధివిధానాలను తొలుత అశ్విన్ అర్థం చేసుకోవాలని, ఆ తర్వాత వాటిని టీమ్‌ఇండియా ఆటగాళ్లకు వివరించాలనీ. ఎందుకంటే క్రికెట్‌లో ఏ విషయాన్నైనా అశ్విన్‌ చాలా త్వరగా అర్థం చేసుకుంటాడనే అభిప్రాయం ఉంది. దాంతో జాఫర్‌ ఇలాంటి పోస్టుతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమ్‌ఇండియా, న్యూజిలాండ్‌ జట్లు పోటీ పడుతున్నాయి. జూన్ 18 నుంచి సౌథాంప్టన్‌ వేదికగా ఆ మ్యాచ్‌ జరగనుంది. అయితే, ఏదైనా అనుకోని కారణాల వల్ల ఆ ఐదు రోజుల్లో మ్యాచ్‌ సమయాన్ని కోల్పోతే రిజర్వ్‌డే కింద ఐసీసీ ఆరో రోజును కేటాయించింది. ఒకవేళ ఐదు రోజుల్లోనే ఫలితం తేలితే రిజర్వ్‌డేతో పనిలేదు. మ్యాచ్‌ డ్రాగా ముగిసినా, టై అయినా.. ఇరు జట్లనూ విజేతలుగా ప్రకటిస్తామని ఐసీసీ పేర్కొంది. కాగా, ఇంగ్లాండ్‌ పర్యటన కోసం టీమ్‌ఇండియా ప్రస్తుతం ముంబయిలో క్వారంటైన్‌లో ఉంది. అందులో అశ్విన్‌ కూడా ఉన్నాడు.

ఇదీ చూడండి IPL 2021: రెండో షెడ్యూల్‌పై నేడే నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.