ETV Bharat / sports

'పీసీబీ ఛైర్మన్​ పోటీలో వసీమ్ అక్రమ్.. కానీ' - పీసీబీ ఛైర్మన్​గా వసీమ్ అక్రమ్

పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు ఛైర్మన్​ పదవిపై మాజీ పేసర్ వసీమ్​ అక్రమ్ కూడా ఆసక్తి కనబరిచాడని పీసీబీ వర్గాలు తెలిపాయి. పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​.. ఛైర్మన్​గా రమీజ్​ రాజాను ఎంపిక చేయడానికి కారణమేంటో స్పష్టం చేశాయి.

wasim akram
వసీమ్ అక్రమ్
author img

By

Published : Aug 30, 2021, 9:42 PM IST

పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవిపై లెజెండరీ పేసర్​ వసీమ్ అక్రమ్​కు కూడా ఆసక్తి ఉండేదని పీసీబీ వర్గాలు తెలిపాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​.. రమీజ్ రాజాను పీసీబీ ఛైర్మన్​గా ఎంపిక చేయడానికి ముందు అక్రమ్​ ఆ పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడని స్పష్టం చేశాయి.

"ఛైర్మన్​ పదవిపై ఆసక్తి చూపిన వారిలో వసీమ్ అక్రమ్​ కూడా ఒకరు. కానీ, ప్రధాని ఇమ్రాన్ ఖాన్​.. రమీజ్​ను బెటర్​ ఛాయిస్​గా భావించారు. అందుకే ఆయనని ఛైర్మన్​గా ఎంపిక చేశారు" అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.

తొలుత ఎహ్సాన్ మణి స్థానంలో వసీమ్ అక్రమ్​ ఛైర్మన్​ కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, గతంలో మ్యాచ్​ ఫిక్సింగ్​ ఆరోపణలు ఎదుర్కొన్న తరుణంలో అక్రమ్​ను పక్కకు పెట్టాల్సి వచ్చిందని పీసీబీ వర్గాలు భావిస్తున్నాయి. 1990 నుంచి 2000 మధ్య అక్రమ్​ సహా పలు పాకిస్థానీ క్రికెటర్లు ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం అక్రమ్​ పీసీబీ క్రికెట్ కమీటీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. కరాచీ కింగ్స్​కు కోచ్​గా, డైరెక్టర్​గా పనిచేస్తున్నాడు.

ఇదీ చదవండి:

'పాక్​ కోచ్​గా చేసేందుకు నేను మూర్ఖుడిని కాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.