ETV Bharat / sports

Pakistan Cricket:'మనం బాగా ఆడితే.. వాళ్లే వస్తారు'

పాకిస్థాన్​ క్రికెట్​ (Pakistan Cricket) జట్టుకు అభిమానలంతా అండగా నిలవాలని ఆ దేశ ఆటగాడు వసీమ్​ అక్రమ్​ అన్నాడు. ఇంగ్లాడ్​, న్యూజిలాండ్​లతో పర్యటనలు రద్దు కావడంతో తానూ అందరిలానే నిరాశ చెందినట్లు తెలిపారు.

wasim akram
వసీమ్​ అక్రమ్​
author img

By

Published : Sep 29, 2021, 6:49 AM IST

Updated : Sep 29, 2021, 7:57 AM IST

సంక్షోభ సమయంలో జాతీయ జట్టుకు అండగా నిలవాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ (Pakistan Cricket) అభిమానులను దిగ్గజ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌ కోరాడు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ జట్లు పాక్‌ పర్యటలను రద్దు చేసుకోవడంతో అందరిలాగే తానూ నిరాశ చెందానని చెప్పాడు. 'న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ జట్లు పాకిస్థాన్‌ పర్యటనలను రద్దు చేసుకోవడం మీకు నిరాశ కలిగించిందని నాకు తెలుసు. నేనూ మీలాగే బాధపడ్డా, నిరాశ చెందా. కానీ ఏదేమైనా జీవితం ముందుకు సాగాల్సిందే. మన ఛైర్మన్‌ రమీజ్‌ రాజా చెప్పినట్లు.. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టుకు మద్దతిద్దాం' అని అక్రమ్‌ అన్నాడు.

'పర్యటనలను రద్దు చేసుకున్నందుకు వాళ్లను తర్వాత విమర్శిద్దాం. పరిష్కారాలను కనుగొందాం. కానీ ఇప్పుడు మాత్రం.. మనమంతా ఒక్కటై మన జట్టుకు మద్దతుగా నిలవాలి. ఒకవేళ జట్లు మన దేశానికి రావొద్దనుకుంటే రాకపోనీయండి. కానీ మన జట్టు ప్రపంచవ్యాప్తంగా బాగా ఆడితే.. జట్లు వాటంతటవే పాకిస్థాన్‌కు వస్తాయి' అని చెప్పాడు.

ఇదీ చూడండి: ఎట్టకేలకు ముంబయికి విజయం.. ప్లే ఆఫ్స్ రేసులో!

Last Updated : Sep 29, 2021, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.