గతంలో పీఎస్ఎల్తో పాటు ఐపీఎల్‌లోనూ పలు జట్లకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్.. తమ జాతీయ జట్టుకు మాత్రం కోచ్‌గా ఉండనంటున్నాడు. అన్నీ తెలిసి కోచ్‌గా చేయడానికి తానేమీ మూర్ఖుడిని కాదని వింత సమాధానం చెప్పాడు. ఆ విషయాన్ని ఆలోచించడానికి కూడా నిరాకరించాడు.
"జట్టు ఓడిపోయిందంటే చాలు ఆటగాళ్లతో పాటు కోచ్‌లను కూడా నిందిస్తారు అభిమానులు. సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్స్ చేస్తారు. అనుచితంగా ప్రవర్తిస్తారు. ఇవన్నీ తెలిసి కూడా కోచ్‌గా పనిచేయడానికి నేను మూర్ఖుడిని కాదు. కోచ్.. జట్టు విజయాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తాడు. అతడు ఆటలో పాల్గొనడు. ఆటగాళ్లు మాత్రమే ఆడుతారు. వీటన్నిటికి భయపడి నేను దూరంగా ఉంటున్నాను. దుష్ప్రచారం లేకుండా ఆటను ప్రేమించినంత కాలం అభిమానులంటే ఇష్టమే ఉంటుంది."
-వసీమ్ అక్రమ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్.
ఒకవేళ కోచ్‌గా పనిచేస్తే ఏడాదిలో 200-250 రోజులు వారికి సమయం కేటాయించాలి. చాలా పని ఉంటుంది. పాకిస్థాన్‌తో పాటు కుటుంబానికి దూరంగా ఉండి ఈ పనులన్నీ నేను చేయలేను. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోని ఎక్కువ మంది ఆటగాళ్లతో ఉండటం కూడా ఒక కారణం అని అక్రమ్ పేర్కొన్నాడు.
2004లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన వసీమ్.. 2010 వరకు వ్యాఖ్యతగా పనిచేశాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లోని పలు ఫ్రాంఛైజీలకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు.
ఇదీ చదవండి: ''ఫ్రీ హిట్' లాగే బౌలర్లకూ 'ఫ్రీ బాల్' ఉండాలి'