Washington Sundar Corona: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్ తగిలింది. భారత జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు కొవిడ్ సోకింది. ఈ నేపథ్యంలో అతడు వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వాషిగ్టంన్ సుందర్‌కు పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గాయం కారణంగా గతకొన్ని రోజులుగా టీమ్ఇండియాకు దూరంగా ఉన్న సుందర్.. విజయ్ హజారే ట్రోఫీలో రాణించి మళ్లీ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
కాగా, జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమ్ఇండియా వన్డే జట్టు కేప్‌టౌన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
ఇదీ చదవండి: