Warner Helicoptor Entry: ఇంటర్నేషనల్ వన్డే, టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ టీ20ల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో వార్నర్ సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో భాగంగా జనవరి 12 శుక్రవారం సిడ్నీ సిక్సర్స్- సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదిక కానుంది.
అయితే ప్రస్తుతం హంటర్ వ్యాలీ (Hunter Valley) ప్రాంతంలో సోదరుడి పెళ్లి వేడుకలో ఉన్న వార్నర్, మ్యాచ్ సమయానికి ముందు హెలికాప్టర్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు దగ్గరలో ఉన్న అలియన్స్ ఫుట్‌బాల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి ల్యాండ్ అవ్వనున్నాడు. దీంతో వార్నర్ హాలీవుడ్ హీరో అంటూ అతడి టీమ్మేట్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. 'వార్నర్ హాలీవుడ్ హీరో. రేపు వార్నర్ ల్యాండ్ అయ్యే సమయానికి నేను గేట్ బయట అతడి కోసం ఎదురుచూస్తా. వార్నర్‌ను బిగ్‌బాష్‌లో చూడాలని ఆశించే ఫ్యాన్స్‌లో నేనూ ఒకడిని. వరల్డ్‌లోనే అత్యుత్తమ క్రికెటర్లలో వార్నర్ ఒకడు' అని ఆసీస్ ప్లేయర్ సీన్ అబాట్ అన్నాడు.
-
David Warner to land via helicopter at SCG to play today's match of BBL 13.#DavidWarner #BigBashLeague #BBL13 #BBL #Warner #Cricket #CricketTwitter #T20 pic.twitter.com/aPrtJ71QIu
— sdn (@sdn7_) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">David Warner to land via helicopter at SCG to play today's match of BBL 13.#DavidWarner #BigBashLeague #BBL13 #BBL #Warner #Cricket #CricketTwitter #T20 pic.twitter.com/aPrtJ71QIu
— sdn (@sdn7_) January 11, 2024David Warner to land via helicopter at SCG to play today's match of BBL 13.#DavidWarner #BigBashLeague #BBL13 #BBL #Warner #Cricket #CricketTwitter #T20 pic.twitter.com/aPrtJ71QIu
— sdn (@sdn7_) January 11, 2024
David Warner Bigbash League: బిగ్‌బాష్ లీగ్‌లో వార్నర్ గతేడాది సిడ్నీ థండర్స్ రెండేళ్ల ఒప్పదం కుదుర్చుకున్నాడు. ఈ సీజన్‌తో ఆ అగ్రిమెంట్ కంప్లీట్ అవనుంది. అయితే డొమెస్టిక్ లీగ్‌ల్లో ఆడతానంటూ వార్నర్ ఇటీవల పేర్కొనడం వల్ల వచ్చే సీజన్లోనూ అతడిని చూడవచ్చు.
Sydney Thunder 2024: ప్రస్తుత లీగ్‌లో సిడ్నీ థండర్స్ ఘోరంగా విఫలమౌతోంది. ఇప్పుటిదాకా 7 మ్యాచ్‌లు ఆడిన థండర్స్ కేవలం ఒక మ్యాచ్‌లోనే నెగ్గి ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో వార్నర్ రాకతో జట్టు ప్రదర్శన మారవచ్చని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక 9 మ్యాచ్‌ల్లో 7 విజయాల (16 పాయింట్లు)తో బ్రిస్బేన్ హీట్ పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లో ఉండగా, 8 మ్యాచ్‌ల్లో 6 ఓటములు ముటగట్టుకున్న మెల్బోర్న్ రెనెగేడ్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పీఎస్ఎల్ విజేతగా లాహోర్.. కెప్టెన్‌గా షహీన్ అఫ్రిది రికార్డు
Maxwell Record: మ్యాక్స్‌వెల్ విధ్వంసం.. 41 బంతుల్లో సెంచరీ