Warner Bag Stolen: ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ పాకిస్థాన్‌తో చివరి టెస్టు కోసం మెల్బోర్న్ నుంచి సిడ్నీ వెళ్తుండగా అతడి బ్యాగ్ చోరీకి గురైంది. ఆ బ్యాగ్‌లో గ్రీన్ క్యాప్ (టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఇచ్చేది), తన పిల్లల విలువైన వస్తువులు ఉన్నాయని వార్నర్ అన్నాడు. అయితే ఆ బ్యాగ్ ఎవరు తీసినా తిరిగి ఇచ్చేయాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా కోరాడు.
'అందరికీ హాయ్! పాక్‌తో మూడో టెస్టు కోసం కొన్ని రోజుల క్రితం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి వస్తుండగా నా బ్యాగ్ పోయింది. మా లగేజ్ ఎవ్వరూ ఓపెన్ చేసినట్లు సీసీ కెమెరాల్లో ఎక్కడా లేదని క్వాంటస్ (విమానం కంపెనీ) తెలిపింది. అయితే క్వాంటస్లో లేదా సిడ్నీ ఎయిర్‌పోర్టులో పనిచేసే వారు ఎవరైనా నా బ్యాగ్ తీసుకుంటే, దయచేసి తిరిగి ఇచ్చేయండి. మీకు బ్యాగ్ కావాలంటే అలాంటిదే నా దగ్గర ఇంకోటి ఉంది. అది ఇస్తాను. మీపై ఎలాంటి యాక్షన్ తీసుకోను. వీలైనంత తొందరగా ఇవ్వండి' అని వార్నర్ వీడియో పోస్ట్ చేశాడు.
అసలేంటీ గ్రీన్ క్యాప్: ఆస్ట్రేలియా ప్లేయర్లు ఎవరైనా జాతీయ జట్టుకు టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పుడు, కిట్‌లో భాగంగా గ్రీన్ కలర్ క్యాప్ ఇస్తారు. అది వారికి ఒక గౌరవంగా ఎప్పటికీ ఉండిపోతుంది.
Warner Test Retirement: వార్నర్ ఇప్పటికే టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, రీసెంట్గా వన్డేలకూ గుడ్ బై చెప్పాడు. 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన వార్నర్ ఇప్పటి వరకు 111 మ్యాచ్‌లు ఆడాడు. 203 ఇన్నింగ్స్‌ల్లో వార్నర్ 44.59 సగటుతో 8695 పరుగులు చేశాడు. అందులో 26 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇక ఈ సిరీస్‌తో వార్నర్ టెస్టు కెరీర్ ముగియనుంది.
Aus Vs Pak 3rd Test: ఆస్ట్రేలియా- పాకిస్థాన్ మధ్య జనవరి 3న మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ఇప్పటికే సిరీస్ చేజిక్కిచ్చుకున్న ఆసీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గి విజయంతో పర్యటనను ముగించాలని పాక్ భావిస్తోంది.
వన్డేలకు 'వార్నర్' గుడ్‌బై- అవసరమైతే ఆ టోర్నీలో ఆడతాడట!
2023 బెస్ట్ ఐకానిక్ మూమెంట్స్- 'విరాట్' 50వ సెంచరీయే హైలైట్