shane warne manager: స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణంతో క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. థాయ్‌లాండ్ విహారంలో ఉన్న షేన్ వార్న్ శుక్రవారం తన విల్లాలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్‌కిన్ బయటపెట్టాడు. అయితే ఇప్పుడు మరో విషయాన్ని వార్న్ మేనేజర్ తెలిపారు. థాయ్‌లాండ్‌కు వెళ్లే ముందు 14 రోజులు కేవలం ద్రవ ఆహారం తీసుకునే డైట్‌ను వార్న్ మొదలు పెట్టారని చెప్పారు. ఒక రోజు ఛాతి వద్ద నొప్పిగా ఉందని, చెమటలు పడుతున్నాయని వార్న్ చెప్పారని మేనేజర్ ఎర్స్‌కిన్ తెలిపారు. సాధారణంగా వార్న్ ఎక్కువగా సిగరెట్లు తాగుతారని ఎర్స్‌కిన్ అన్నారు. అందుకే అది గుండెపోటే అయి ఉంటుందని, ఇంకా వేరేది ఏం కాదన్నారు.
సహజ మరణమే..
వార్న్ మరణంలో అనుమానాస్పద సూచనలేమీ లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని థాయ్‌లాండ్ పోలీసులు తెలిపారు. శవపరీక్షలో కూడా సహజ కారణాల వల్లే వార్న్ మృతిచెందినట్లు స్పష్టమైందని వెల్లడించారు.
బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారని కొద్ది రోజుల ముందు వార్న్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చదవండి: వార్న్ గదిలో రక్తపు మరకలు.. కారణం ఏంటి?