టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కుడి భుజానికి గాయమైంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో(ind vs pak) ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా పాండ్య భుజానికి బంతి తగిలింది. దీంతో పాక్ ఇన్నింగ్స్‌లో హార్దిక్ ఫీల్డింగ్‌కు రాలేదు. అతడి బదులు ఇషన్ కిషన్ ఫీల్డింగ్ చేశారు. ముందు జాగ్రత్తగా పాండ్యను స్కానింగ్ కోసం పంపించినట్లు బీసీసీఐ వెల్లడించింది.
బౌలింగ్ అనుమానమే..
మ్యాచ్‌కు ముందు తన బౌలింగ్ ఫామ్‌పై స్పందించిన హార్దిక్.. రానున్న మ్యాచుల్లో బౌలింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అందుకోసం నిపుణుల సలహాలు తీసుకుంటానని వెల్లడించాడు. అయితే ప్రస్తుత గాయం కారణంగా అతడు బంతి చేతపట్టడం అనుమానంగా మారింది.
టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) హార్దిక్ పాండ్య(Hardik Pandya News) బౌలింగ్ చేస్తాడా? లేదా అనే అంశంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్య కనీసం రెండు ఓవర్లైనా బౌలింగ్ చేస్తే బాగుంటుందని టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News) శనివారం అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన హార్దిక్ ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్‌ల్లోనూ హార్దిక్ బౌలింగ్ చేయలేదు.
ఓడిన టీమ్ఇండియా..
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది టీమ్ఇండియా. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం పాక్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (79*), కెప్టెన్ బాబర్ అజామ్ (68*) భారీ భాగస్వామ్యంతో పాక్‌కు విజయాన్ని అందించారు. భారత బౌలర్లు ఎంత కష్టపడినా వికెట్ దక్కలేదు. టీమ్ఇండియా బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాక్ బ్యాటర్లు నింపాదిగా తమపని చేసుకుని వెళ్లిపోయారు. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్నిరంగాల్లో రాణించిన పాకిస్థాన్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్ పోటీల్లో భారత్‌పై పాకిస్థాన్ తొలి విజయం సాధించడం విశేషం.
ఇదీ చదవండి: T20 worldcup: తడబడిన టీమ్ఇండియా.. పాకిస్థాన్ లక్ష్యం 152