Wahab Riaz Retirement : పాకిస్థాన్ 38 ఏళ్ల పేస్ బౌలర్ వహబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టిన రియాజ్.. ఇకపై దేశవాలీలో కొనసాగనున్నాడు.
అయితే రియాజ్ 2008లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. 15 ఏళ్లుగా తన జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. 2011, 2015, 2019 మూడు వన్డే ప్రపంచకప్‌ల్లో ఆడాడు. 26 ఏళ్ల వయసులో రియాజ్.. తన కెరీర్లో మొదటి వరల్డ్ కప్ (2011) ఆడాడు. ఈ టోర్నీ సెమీఫైనల్స్, భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో రియాజ్.. టీమ్ఇండియా ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ ఆ సెమీస్‌లో భారత్ 29 పరుగుల తేడాలో గెలిచి ఫైనల్స్‌కు వెళ్లింది.
చివరిసారిగా 2020లో న్యూజిలాండ్‌పై టీ20 మ్యాచ్ ఆడాడు రియాజ్. ఆ తర్వాత రియాజ్ ఆటకు దూరంగా ఉన్నాడు. కెరీర్లో 28 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడిన రియాజ్ 237 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ల జాబితాలో రియాజ్ 18వ స్థానంలో ఉన్నాడు. అందరికి కంటే టాప్‌లో వసీం అక్రమ్ (961 వికెట్లు) ఉన్నాడు. అతడి తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా వకార్ యూనిస్ (789 వికెట్లు), ఇమ్రాన్ ఖాన్ (544 వికెట్లు) ఉన్నారు.
-
🏏 Stepping off the international pitch
— Wahab Riaz (@WahabViki) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
🌟 After an incredible journey, I've decided to retire from international cricket. Big thank you to PCB, my family, coaches, mentors, teammates, fans, and everyone who supported me. 🙏
Exciting times ahead in the world of franchise…
">🏏 Stepping off the international pitch
— Wahab Riaz (@WahabViki) August 16, 2023
🌟 After an incredible journey, I've decided to retire from international cricket. Big thank you to PCB, my family, coaches, mentors, teammates, fans, and everyone who supported me. 🙏
Exciting times ahead in the world of franchise…🏏 Stepping off the international pitch
— Wahab Riaz (@WahabViki) August 16, 2023
🌟 After an incredible journey, I've decided to retire from international cricket. Big thank you to PCB, my family, coaches, mentors, teammates, fans, and everyone who supported me. 🙏
Exciting times ahead in the world of franchise…
"క్రికెట్లో అద్భుతమైన ప్రయాణం తర్వాత ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఈ కెరీర్లో నాకు మద్దతుగా నిలిచిన.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), నా కుటుంబం, కోచ్‌లు, మెంటర్లు, సహచర ఆటగాళ్లు, అభిమానులు అందరికీ నా కృతజ్ఞతలు" అని వహాబ్ రియాజ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్న రియాజ్.. ఇటీవలె రాజకీయ అరంగేట్రం చేశాడు. ఈ సంవత్సరం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ స్టోర్ట్స్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఐపీఎల్ స్థాయి వేరు: పాక్ పేసర్
కెప్టెన్ బాబర్ న్యూడ్ వీడియో కాల్స్.. పాక్ క్రికెట్ బోర్డు ఏం చెప్పిందంటే?