ETV Bharat / sports

Ind vs Eng: 'నాలుగో టెస్టులో గెలుపు భారత్​దే' - క్రికెట్ న్యూస్

మూడోరోజు భారత ఆటగాళ్ల ప్రదర్శనపై నాలుగో టెస్టు విజయం ఆధారపడి ఉంటుందని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ అన్నాడు. మన జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.

team india 4th test
టీమ్​ఇండియా
author img

By

Published : Sep 4, 2021, 4:23 PM IST

నాలుగో టెస్టులో విజయావకాశాలు టీమ్​ఇండియాకే ఎక్కువగా ఉన్నాయని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. భారత జట్టులో ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారని.. వాళ్లు కచ్చితంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఓవల్‌ మైదానంలో రాణిస్తారని విశ్లేషించాడు.

రెండో రోజు భారత్‌ తక్కువ పరుగులకే ఇంగ్గాండ్‌ను నిలువరిస్తుందని అంచనా వేసినా.. బౌలర్లు పట్టు విడవడం వల్ల ఆతిథ్య జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఓలీ పోప్‌ (81), క్రిస్ వోక్స్‌ (50)ను నిలువరించలేకపోవడం వల్ల ఆధిక్యం సాధించింది. అయితే, కోహ్లీసేన మూడో రోజు మొత్తం బ్యాటింగ్‌ చేయగలిగితే ఇంగ్లాండ్‌పై పైచేయి సాధించవచ్చని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు.

VVS Laxman
వీవీఎస్ లక్ష్మణ్

భారత్‌ ఇప్పటికీ 56 పరుగులు వెనుకబడి ఉంది. రెండోరోజు ఆట ముగిసేసరికి భారత్‌ 43/0 స్కోరుతో నిలిచింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్ (22), రోహిత్ శర్మ (20) క్రీజులో ఉన్నారు.

"టీమ్ఇండియా ఆటగాళ్లంతా మ్యాచ్‌ గెలవాలనే కసితో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తుంది. అయితే, మొదటి సెషన్‌ చాలా కీలకం. భారత్‌ బ్యాటింగ్‌లో రాణించలేకపోతే.. మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. రోజంతా ఆడి కనీసం 250 పరుగుల ఆధిక్యాన్ని సాధిస్తేనే ఇంగ్లాండ్‌కు గట్టిపోటీ ఇవ్వగలుగుతాం" అని లక్ష్మణ్‌ అన్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.