ETV Bharat / sports

ఆ పాకిస్థాన్ పేసర్లు స్పిన్నర్లలా అనిపించేవారన్న వీరూ - వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్​ సెంచరీ మ్యాచ్

2004లో జరిగిన ముల్తాన్​ టెస్టు అనుభవాల గురించి సెహ్వాగ్​ పలు విషయాలు పంచుకున్నాడు. ఆ టెస్టులో పేసర్లను ఎదుర్కొంటున్నప్పుడు స్నిన్నర్లలా అనిపించారని అన్నారు. అయితే ఆ టెస్టులో సెహ్వాగ్ ట్రిపుల్​ సెంచరీ చేసి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడుగా రికార్డులకెక్కడం గమనార్హం.

virender sehwag
virender sehwag said that while facing pakisthan pacers in multan test i was felt like facing spinners
author img

By

Published : Aug 25, 2022, 8:09 PM IST

Updated : Aug 26, 2022, 6:57 AM IST

పాకిస్థాన్ అంటే చెలరేగిపోయే టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన ఫెవరెట్​ మెమొరీస్​ పంచుకున్నాడు. పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​తో ఓ క్రీడా ఛానల్​ నిర్వహించిన చిట్​చాట్​ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాక్ జట్టుపై ముల్తాన్​లో త్రిపుల్ సెంచరీ బాదిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. పాక్ బౌలర్లు అక్తర్​, మహమ్మద్​ సమీ గంటకు 145, 155 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్​ చేసేవారన్నారు. వారిద్దరినీ ఎదుర్కొన్నాక తనకు కాన్ఫిడెన్స్ పెరిగిందన్నారు. షబ్బీర్ అహ్మద్​, అబ్దుల్ రజాక్​ లాంటి పాకిస్థానీ పేసర్లను ఎదుర్కొన్నప్పడు, స్పిన్నర్స్​ని ఎదుర్కొన్న ఫీలింగ్ కలిగిందని చెప్పారు.

''2004లో ముల్తాన్​లో పాకిస్థాన్​తో ఆడిన టెస్టు ప్రదర్శనే నాకు ఫెవరెట్​ మెమొరీ. ఎందుకంటే నాలాంటి ప్లేయర్​, ఓపెనర్​ ట్రిపుల్​ సెంచరీ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. సెహ్వాగ్​ టెస్టు ప్లేయర్​ కాదని, అతడు భారీ స్కోర్లు చేయలేడని వార్త పత్రికల్లో రాసేవారు. కామెంటేటర్స్​ కూడా అలానే అనేవారు. అయితే దానికన్నా ముందు నేను ఆడిన 4 వన్డే ఇన్నింగ్స్​ల్లో కూడా నా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అప్పుడు నేను పరుగులు చేయకుంటే, టీమ్​ నుంచి తీసేస్తారేమోనని అనుకునేవాడిని. కానీ ముల్తాన్​ టెస్టులో మంచి స్టార్ట్​ దొరికితే స్కోరు భారీగా చేద్దామనుకున్న. అనుకున్నట్టుగానే ముల్తాన్​ టెస్టులో నాకు మంచి ఆరంభం లభించింది'' అని సెహ్వాగ్​ వీడీయోలో పేర్కొన్నారు.

పాకిస్థాన్​తో ఎప్పుడు మ్యాచ్​ జరిగినా వీరేంద్ర సెహ్వాగ్​ అత్యుత్తమ ప్రదర్శన చేసేవారు. వీరూ కెరీర్​లో 2004 ముల్తాన్​లో పాకిస్థాన్​తో జరిగిన టెస్ట్ ప్రదర్శన ప్రత్యేకమైనది. ఆ మ్యాచ్​లో సెహ్వాగ్ 309 పరుగులు చేశాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. అదే మ్యాచ్​లో సచిన్ 194 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత్​ 675/5కు తొలి ఇన్నింగ్స్​ డిక్లేర్​ చేసింది. తర్వాత పాకిస్థాన్ 407 పరుగులు చేసింది. ఫాలోఆన్ ఇన్నింగ్స్​లో పాకిస్థాన్​ 216 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్​ ఇన్నింగ్స్​ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇవీ చూడండి:

ద్రవిడ్​ స్థానంలో భారత హెడ్​ కోచ్​గా వీవీఎస్​ లక్ష్మణ్​

Last Updated : Aug 26, 2022, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.