ETV Bharat / sports

కొవిడ్​ బాధితులకు అండగా 'సెహ్వాగ్​ ఫౌండేషన్​' - వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్

కరోనా బాధితుల కోసం ఇంటిలో వండిన ఆహారాన్ని అందిస్తోంది మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్. గత నెల 25న మొదలు పెట్టిన ఈ ఫౌండేషన్ ఇప్పటివరకు 51వేల మందికి భోజనాన్ని పంచింది.

virender sehwag, former india cricketer
వీరేంద్ర సెహ్వాగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్
author img

By

Published : May 16, 2021, 10:58 AM IST

కొవిడ్​తో పోరాడుతున్న దేశానికి మద్దతుగా నిలుస్తున్న క్రీడాకారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా టీమ్​ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ జాబితాలో చేరాడు. తన వంతు సాయంగా ఓ ఫౌండేషన్​ను స్థాపించి దాని ద్వారా కరోనా బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నాడు.

ఇంట్లో వండిన ఆహారాన్ని కొవిడ్​ బాధితులకు పంచడానికి నిర్ణయించుకున్నట్లు వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్​ తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో ఏప్రిల్ 25న ప్రకటించింది. ఇప్పటివరకు 51వేలకు పైగా మహమ్మారి బాధితులకు ఆహారాన్ని ఉచితంగా అందించినట్లు ఫౌండేషన్ వెల్లడించింది. దీంతో పాటు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొంది. ఇంకా ఎవరైనా బాధితులు అన్నం లేక అలమటించినట్లయితే తమను సంప్రదించాలని ఫౌండేషన్​ కోరింది. తమకు సహాయం చేయాలనుకున్న వారు virenderfoundation84@upiకి విరాళాలు అందించాలని తెలిపింది.

  • Privileged to have offered over 51000 free home cooked meals so far to covid patients in the last month in Delhi NCR. If you have a family in Delhi which is affected by Covid and need home cooked food made with love, please do DM. https://t.co/fa0amFAwwG pic.twitter.com/6Qc4ZktUFY

    — Virender Sehwag Foundation (@SehwagFoundatn) May 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్​, యుజ్వేంద్ర చాహల్, రిషభ్ పంత్, జయదేవ్​ ఉనద్కత్ వంటి చాలా మంది ఆటగాళ్లు.. కరోనా బాధితులకు అండగా ఉండేందుకు ముందడుగు వేశారు.

కరోనా కష్ట కాలంలో మరో మాజీ క్రికెటర్​, ఎంపీ గౌతమ్​ గంభీర్​.. ప్రజలకు సాయం చేస్తున్నాడు. ప్రజలకు ఫాబి ఫ్లూ టాబ్లెట్లను ఉచితంగా పంచుతున్నాడు. కాదా.. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొవిడ్ బాధితులు మందులు దొరక్క ఇబ్బంది పడుతుంటే.. ఇన్నీ మందులు ఎలా తన దగ్గరకు వచ్చాయో చెప్పాలంటూ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: బాల్​ ట్యాంపరింగ్​ వివాదంపై మరోసారి దర్యాప్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.