ETV Bharat / sports

కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌.. షాక్​ అవుతున్న ఫ్యాన్స్​​ - ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ క్యాచ్

ఆసీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్​లో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్​ ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో మీరు చూసేయండి..

Kohli catch viral
కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌
author img

By

Published : Oct 17, 2022, 8:08 PM IST

టీ20 ప్రపంచకప్‌ ముంగిట గబ్బా వేదికగా ఆసీస్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం సాధించింది. ఈ సందర్భంగా క్రికెట్‌ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠతో పాటు కావలసినంత వినోదం లభిస్తోంది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ తన స్టన్నింగ్‌ క్యాచులతో అభిమానులకు కనులవిందు చేశాడు. ఫిట్‌నెస్‌ విషయంలో తన సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు.

జోష్‌ ఇంగ్లిస్‌ను డైవ్‌ చేసిన కోహ్లీ.. ఒంటిచేత్తో రనౌట్‌ చేశాడు. చివరి ఓవర్‌లో షమీ బౌలింగ్‌ వేయగా.. కమిన్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను సైతం ఒంటిచేత్తో అందకుని ఆశ్చర్యపరిచాడు. రెండు సందర్భాల్లోనూ తన బ్యాలెన్స్‌ను ఏమాత్రం కోల్పోకుండా విరాట్‌ ఆడిన తీరును అభిమానులు కొనియాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో తన ఆటతో అదరగొట్టిన షమీ.. పాకిస్థాన్‌ పేసర్‌ షహీన్‌ షా అఫ్రిదికి బౌలింగ్‌ మెలకువలు నేర్పుతూ కెమెరాకు చిక్కాడు. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లే అయినా వీరిద్దరూ కలిసి ఇలా సరదాగా చర్చించుకుంటున్న సన్నివేశం అభిమానుల మనసు దోచేస్తోంది. ఈ వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇదీ చూడండి: ఆస్ట్రేలియాతో వార్మప్​ మ్యాచ్​.. అక్షర్​తో సూర్య అలా అనేశాడేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.