Virat Kohli World Cup : ముంబయి వాంఖడే వేదికగా నవంబర్ 2న శ్రీలంక - భారత్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచకప్ ప్రారంభం నుంచే.. భారత్ ఆడుతున్న ప్రతీ మ్యాచ్‌కు ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఆడియోన్స్.. చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఎంజాయ్ గేమ్‌ను చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం నాటి మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ స్లోగన్స్ ఇస్తూ సందడి చేశారు.
మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక.. త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. 20 పరుగుల లోపే లంక.. ఆరు కీలక వికెట్లు చేజార్చుకుంది. దీంతో భారత్ విజయం దాదాపు ఖరారైందని స్టేడియంలో ఫ్యాన్స్.. అప్పుడే సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శ్రీలంక 23/7 స్థితిలో ఉండగా, కొందరు టీమ్ఇండియా అభిమానులు.. 'కోహ్లి కో బౌలింగ్ దో(Kohli Ko Bowling Do!)' అంటూ స్లోగన్స్ ఇచ్చారు. అంటే, కోహ్లికి బౌలింగ్ వేసే అవకాశం ఇవ్వండి అని అర్థం. ఇది విన్న విరాట్.. స్టాండ్స్‌లో ఉన్న అభిమానుల వైపు చూస్తూ ఫన్నీగా స్పందించాడు. కొద్దిసేపటి తర్వాత, అభిమానుల కోరిక కాదనలేక చేతిలో బౌల్ లేకుండానే వార్మప్ మాదిరిగా సరదాగా బౌలింగ్ యాక్షన్‌లో పరిగెత్తాడు. అంతే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
-
Imagine the havoc this 𝘳𝘪𝘨𝘩𝘵-𝘢𝘳𝘮 𝘲𝘶𝘪𝘤𝘬 𝘣𝘰𝘸𝘭𝘦𝘳 would've caused today! 😜#ViratKohli #INDvSL #CWC23 pic.twitter.com/7qXebiVqXI
— Punjab Kings (@PunjabKingsIPL) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Imagine the havoc this 𝘳𝘪𝘨𝘩𝘵-𝘢𝘳𝘮 𝘲𝘶𝘪𝘤𝘬 𝘣𝘰𝘸𝘭𝘦𝘳 would've caused today! 😜#ViratKohli #INDvSL #CWC23 pic.twitter.com/7qXebiVqXI
— Punjab Kings (@PunjabKingsIPL) November 2, 2023Imagine the havoc this 𝘳𝘪𝘨𝘩𝘵-𝘢𝘳𝘮 𝘲𝘶𝘪𝘤𝘬 𝘣𝘰𝘸𝘭𝘦𝘳 would've caused today! 😜#ViratKohli #INDvSL #CWC23 pic.twitter.com/7qXebiVqXI
— Punjab Kings (@PunjabKingsIPL) November 2, 2023
-
Virat Kohli's reaction when Wankhede crowd chanted 'Kohli ko bowling do'. 😂❤️pic.twitter.com/ggvdm8jEY5
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Virat Kohli's reaction when Wankhede crowd chanted 'Kohli ko bowling do'. 😂❤️pic.twitter.com/ggvdm8jEY5
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023Virat Kohli's reaction when Wankhede crowd chanted 'Kohli ko bowling do'. 😂❤️pic.twitter.com/ggvdm8jEY5
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023
షూస్ గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిత్, అయ్యర్.. ఇదిలా ఉంటే శ్రీలంకతో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అక్కడకు వచ్చిన కొంతమంది ఫ్యాన్స్‌తో వీరిద్దరూ ముచ్చటించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చిన్నారులకు తమ వెంట తెచ్చుకున్న షూస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో షూస్ తీసుకున్న ఫ్యాన్స్ అనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోహిత్, అయ్యర్ చేసిన పనిని క్రికెట్ అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.
-
Rohit Sharma & Shreyas Iyer gifting shoes to kids post #IndvsSL match at Wankhede stadium
— Naishav Mehta (@MehtaNaishav) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Thanks @allaboutcric_ for your timely updates pic.twitter.com/wv0E6fzkjq
">Rohit Sharma & Shreyas Iyer gifting shoes to kids post #IndvsSL match at Wankhede stadium
— Naishav Mehta (@MehtaNaishav) November 2, 2023
Thanks @allaboutcric_ for your timely updates pic.twitter.com/wv0E6fzkjqRohit Sharma & Shreyas Iyer gifting shoes to kids post #IndvsSL match at Wankhede stadium
— Naishav Mehta (@MehtaNaishav) November 2, 2023
Thanks @allaboutcric_ for your timely updates pic.twitter.com/wv0E6fzkjq
'బెస్ట్ ఫీల్డర్' గా శ్రేయస్ - మాస్టర్ బ్లాస్టర్ అనౌన్స్మెంట్
హిట్‌మ్యాన్ వరల్డ్ కప్ రికార్డుపై ఆ స్టార్ ప్లేయర్ ఫోకస్ - కొడితే తొలి బ్యాటర్‌గా!