ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్(Mitchell Johnson) భీకర బౌలింగ్ కంటే ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్(Anderson) బౌలింగ్‌లో కోహ్లీ(Virat kohli) ఎక్కువగా తడబడుతున్నాడని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మన్ అయినా స్వింగ్ బౌలింగ్‌లో సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేడని.. స్వింగ్ అవుతున్న బంతిని అంచనా వేయడం కష్టమని అని ఇర్ఫాన్ అన్నాడు.
"పాట్ కమిన్స్, జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో రిషభ్ పంత్, జోస్ బట్లర్ ల్యాప్ షాట్(వికెట్ల వెనుకకు బాదడం),రివర్స్ స్వీప్స్ షాట్లు ఆడటం మనం చూశాం. వేగంగా మాత్రమే బౌలింగ్ చేసి విజయవంతం కాలేం ఎందుకంటే బ్యాట్స్‌మెన్ ఎల్లప్పుడూ పేస్‌కు భయపడరు. మీరు రాణించాలంటే నైపుణ్యం తప్పనిసరి. స్వింగ్ అనేది గొప్ప కళ."
- ఇర్ఫాన్ పఠాన్, టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్
2014లో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో కోహ్లీ అండర్సన్(Kohli Anderson) బౌలింగ్‌లో నాలుగుసార్లు ఔటవ్వడమే కాకుండా 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. ఆగస్టులో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్(IND vs ENG test series)తో ఐదు టెస్టులు ఆడనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇర్ఫాన్ ఈ విధంగా స్పందించాడు.
ఇదీ చూడండి.. IND vs PAK: 'మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు జరగాలి!'