ETV Bharat / sports

'వామిక రాకతో మా జీవితం పరిపూర్ణమైంది'

Virat Kohli Wedding Anniversary: వివాహబంధంలోకి అడుగు పెట్టి నాలుగేళ్లు అయిన సందర్భంగా తన సతీమణి అనుష్క శర్మకు శుభాకాంక్షలు తెలిపాడు టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. అనుష్క, వామికతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశాడు.

kohli, anushka, vamika
కోహ్లీ, అనుష్క, వామిక
author img

By

Published : Dec 11, 2021, 8:18 PM IST

Virat Kohli Wedding Anniversary: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహ బంధం నాలుగో ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తన ప్రియసఖి అనుష్కకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పాడు కోహ్లీ. అంతే కాదండోయ్‌.. ఈ సంవత్సరం విరుష్క జంటకు ప్రత్యేకమైంది కూడానూ. తమ ముద్దుల తనయ వామికతో కలిసి తొలిసారి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ తన జీవిత భాగస్వామి గురించి సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాలను వెల్లడించాడు. అనుష్క, వామికతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశాడు.

"నాలుగేళ్లు నేను వేసిన సిల్లీ జోక్‌లను, నా బద్ధకాన్ని భరించావు. నేను ఎంత చికాకుగా ఉన్నా ప్రేమించావు. నాలుగు సంవత్సరాలుగా దేవుడి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ నాలుగేళ్ల వివాహ జీవితంలో నిజాయితీ, ప్రేమ, ధైర్యం ప్రదర్శించిన మహిళగా వృద్ధి చెందావు. ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నన్ను మంచి వైపు నిలబడేలా నాలో స్ఫూర్తి నింపావు. నీతో పెళ్లై నాలుగేళ్లైంది. నన్ను అన్నివిధాలుగా మార్చివేశావు. నిన్ను ఎల్లవేళలా ప్రేమిస్తూనే ఉంటా. కుటుంబంగా ఇది మొదటి వార్షికోత్సవం. మన జీవితంలో వామిక రావడంతో జీవితం పరిపూర్ణమైంది" అని కోహ్లీ పోస్ట్ పెట్టాడు. దీంతో కోహ్లీ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంపై ప్రతి ఒక్కరూ ఇలానే ప్రేమ, ఆప్యాయత చూపించాలని ఆకాంక్షించారు.

వివాహానికి ముందు ఎక్కడ చూసినా విరాట్‌-అనుష్క గురించే చర్చ. ఎంతో గోప్యత పాటించిన ఈ జంట కొన్నాళ్లపాటు ప్రేమించుకుని 2017 డిసెంబర్‌ 11న ఒక్కటయ్యారు. వీరికి ఈ ఏడాది జనవరి 11న వామిక జన్మించింది. విరాట్ ఏ దేశంలో మ్యాచ్‌లు ఆడినా అనుష్క కూడా అక్కడికే వెళ్లిపోయేది. గత ఐపీఎల్‌ యూఏఈ సీజన్‌ సమయంలోనూ దుబాయ్​కి వెళ్లింది. మరోవైపు విరాట్‌ కోహ్లీ స్థానంలో భారత వన్డే, టీ20 జట్లకు సారథిగా రోహిత్‌ శర్మ నియమితులయ్యాడు. ఇక నుంచి టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. ఈ నెలలోనే టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. మూడు టెస్టులు, మూడు వన్డేలను ఆడుతుంది.

ఇదీ చదవండి:

'పుష్ప' సాంగ్​లో డేవిడ్ వార్నర్.. కోహ్లీ ఫన్నీ రిప్లై

Virat ODI Captaincy: 'కెప్టెన్సీ నిర్ణయంలో పారదర్శకత లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.