టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 2010 దశాబ్దపు విజ్డెన్ అల్మనాక్ వన్డే క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 2011-20 మధ్య కాలంలో అతడు 60 సగటుతో 11 వేలకు పైగా పరుగులు చేయడమే ఇందుకు కారణం. ఈ పదేళ్ల కాలంలో 2011 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ 50 ఓవర్ల ఈవెంట్లు ఐదింటిలో కోహ్లీ పాల్గొన్నాడు.
దిగ్గజ సచిన్ తెందూల్కర్‌ను 1990 దశాబ్దానికి, కపిల్‌దేవ్‌ను 1980 దశాబ్దానికి విజ్డెన్ వన్డే క్రికెటర్లుగా అవార్డులు పొందారు.
'విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద వరల్డ్ 2020'గా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. కీరన్ పొలార్డ్.. 'టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్'గా, బెత్ మూనీ(ఆసీస్).. 'లీడింగ్ మహిళా క్రికెటర్'గా ఎంపికయ్యారు.
అంతకు ముందు ఇదే ఏడాది ప్రారంభంలో కోహ్లీ.. ఐసీసీ దశాబ్దపు క్రికెటర్, ఐసీసీ దశాబ్దపు వన్డే క్రికెటర్‌గానూ నిలిచాడు. ఐసీసీ దశాబ్దపు టెస్టు జట్టులో కెప్టెన్‌గానూ స్థానం దక్కించుకున్నాడు.
ఇవీ చదవండి: