ETV Bharat / sports

ఫామ్​లో లేకపోయినా అగ్రస్థానంలో కోహ్లీ.. ఇదెలా సాధ్యం? - కోహ్లీ సెంచరీ

Kohli higest runs: తనపై విమర్శలతో రెచ్చిపోతున్న వారికి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ​. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇదెలా సాధ్యమైందంటే?

kohli highest runs
కోహ్లీ అత్యధిక పరుగులు
author img

By

Published : Jul 26, 2022, 6:54 PM IST

Kohli higest runs: కోహ్లీని జట్టు నుంచి తప్పించాలి? ఫామ్‌లో లేడు.. మూడేళ్లుగా ఒక్క సెంచరీ చేయలేదు.. అతడిని ఆడించడం అనవసరం.. ఇలా కొద్దిరోజులుగా విరాట్​పై ఎన్నో విమర్శలు. అయితే ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. ఈ విమర్శలకు అతడు పరోక్షంగా కాస్త గట్టిగానే సమాధానమిచ్చాడు. అదీ కూడా పరుగులు చేసి. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అదెలా అంటే...

చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏంటంటే..2019 ప్రపంచకప్‌ తరవాత టీమ్‌ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్‌ కోహ్లీనే. విరాట్‌ అప్పటినుంచి ఒక్క శతకం బాదకపోయినా, అత్యధిక పరుగుల జాబితాలో అతడే టాప్‌లో ఉండటం గమనార్హం. కోహ్లీ అప్పటినుంచి ఇప్పటివరకు 83 మ్యాచ్‌ల్లో 3564 పరుగులతో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా, రోహిత్‌ 70 మ్యాచ్‌ల్లో 3318, పంత్‌ 75 మ్యాచ్‌ల్లో 2593, కేఎల్‌ రాహుల్‌ 57 మ్యాచ్‌ల్లో 2524, శ్రేయాస్‌ అయ్యర్‌ 64 మ్యాచ్‌ల్లో 2124 పరుగులు సాధించి తరువాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ లెక్కలు చూస్తుంటే విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడని ఎక్కడా స్పష్టంగా కనిపించక పోయినా, అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక కారణం ఏమిటంటే, గత దశాబ్ద కాలంలో విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌ కారణంగా, ప్రతి మూడో, నాల్గో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ లేదా భారీ స్కోర్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతడు సెంచరీ చేయలేకపోయేసరికి నిరాశకు గురి అవుతున్నారు. ఇటీవల ముగిసిన భారత టీ20 లీగ్‌ తరవాత కోహ్లీపై ఒత్తిడి మరింత పెరగడంతో ఓ మోస్తారు పరుగులు కూడా రాబట్టలేకపోతున్నాడు. దీంతో విమర్శకులు ఇదే అదునుగా వేలెత్తిచూపుతున్నారు. అయితే, విరాట్‌ ఒక్క భారీ ఇన్నింగ్స్‌తో శతకాల బాట పడతాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీకి సెలెక్టర్లు విరామం ఇచ్చారు. ఆగస్టులో జరిగే ఆసియా కప్‌ లేదా దానికి ముందు జరిగే జింబాబ్వే సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది.

2019 నుంచి ఇప్పటివరకు కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 44.68 సగటుతో 4737 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలున్నాయి. అయితే ఇవన్నీ ప్రపంచకప్‌కు ముందు సాధించినివే. 2019లో 44 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్‌ 64.60 సగటుతో 2455 పరుగులు సాధించాడు. 2020లో 22 ఇన్నింగ్స్‌ల్లో 36.60 సగటుతో 842 పరుగులు, 2021లో 24 ఇన్నింగ్స్‌లు ఆడి 37.07 సగటుతో 964 పరుగులు, 2022లో 16 ఇన్నింగ్స్‌ల్లో 25.05 సగటుతో 476 పరుగులు చేశాడు. మొత్తంగా 2019 ప్రపంచకప్‌ తరవాత 83 మ్యాచ్‌ల్లో 42.93 సగటుతో 3564 రన్స్‌ సాధించి టీమ్‌ఇండియా తరఫున టాప్‌లో ఉండటం విశేషం.

ఇదీ చూడండి: టీ20 సిరీస్​.. కెప్టెన్​ రోహిత్​ రెడీ.. కానీ ఆ స్టార్​ ఓపెనర్​ మాత్రం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.