ETV Bharat / sports

విండీస్​తో టీ20లకూ విరాట్ దూరం.. పంత్, బుమ్రా, హార్దిక్ అనుమానమే! - వెస్టిండీస్​ పర్యటనకు కోహ్లీ దూరం

Kohli miss Westindies tour: వెస్టిండీస్​తో ఇప్పటికే వన్డే సిరీస్​కు దూరంగా ఉన్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ.. ఇప్పుడు టీ20 సిరీస్​కు కూడా అందుబాటులో ఉండడని తెలిసింది. పూర్తి పర్యటనకు దూరం కానున్నాడట. విరాట్​ విశ్రాంతి కోరడం వల్ల సెలక్టర్లు అతడు పేరును పరిగణనలోకి తీసుకోవట్లేదని సమాచారం. ఇక పంత్​, బుమ్రా, హార్దిక్ పాండ్య కూడా అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది.

Kohli miss Westindies tour
వెస్టిండీస్ పర్యటనకు కోహ్లీ దూరం
author img

By

Published : Jul 8, 2022, 9:46 AM IST

Kohli miss Westindies tour: పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ గురించి.. అభిమానులను నిరాశపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. పేలవ ఫామ్​లో ఉన్న అతడు.. వెస్టిండీస్​ పర్యటనకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

టీమ్​ఇండియా-వెస్టిండీస్​ ఈ నెల 22నుంచి మూడు వన్డేలతో పాటు ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే ప్రకటించిన వన్డే జట్టులో కోహ్లీ లేడు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన అతడు.. ఆ జట్టుతో రెండో టీ20 నుంచి అందుబాటులోకి రానున్నాడు. అయితే ఇంగ్లాండ్​ పర్యటన ముగిశాక కోహ్లీ వెస్టిండీస్‌కు వెళ్లట్లేదని తెలిసింది. విరాట్​ విశ్రాంతి కోరడం వల్ల సెలక్టర్లు అతడు పేరును పరిగణనలోకి తీసుకోవట్లేదని సమాచారం. ఇతడితో పాటు హార్దిక్‌ పాండ్య, రిషబ్‌ పంత్‌, బుమ్రా సైతం ఈ సిరీస్​కు దూరం కానున్నారు. కాగా, వీరితో పాటు రోహిత్‌ కూడా వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఈ సిరీస్‌లో శిఖర్‌ ధావన్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇక స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యే సూచనలున్నాయి. మొత్తంగా ఈ సిరీస్​కు సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ఈ నెల 11న ప్రకటించనున్నారు.

ఇదీ చూడండి: హార్దిక్​ ఆల్​రౌండ్​ షో.. తొలి టీ20లో టీమ్​ఇండియా ఘన​ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.