Virat Kohli meets Babar Azam : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే చాలు యావత్ క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఆదివారం యూఏఈలో జరగబోయే ఈ పోరును వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 27న యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియాకప్ టోర్నీ కోసం భారత్ సహా అన్ని దేశాల జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. ఈ తరుణంలోనే దాయాది జట్ల స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ ఇద్దరు కలిసిన ఓ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. అతనికి ఆల్ ద బెస్ట్ చెపుతూ కనిపించాడు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో సతమతమవుతుండగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ అన్ని పార్మాట్లలోను అదరగొడుతున్నాడు. మూడేళ్లుగా ఫామ్‌లో లేని 'కింగ్ కోహ్లీ' ఈ మ్యాచ్‌తోనైనా తిరిగి ఫామ్‌ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీకి ఇది వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం.
-
Hello DUBAI 🇦🇪
— BCCI (@BCCI) August 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1sz
">Hello DUBAI 🇦🇪
— BCCI (@BCCI) August 24, 2022
Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1szHello DUBAI 🇦🇪
— BCCI (@BCCI) August 24, 2022
Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1sz
Virat kohli on his bad form: ఆసియా కప్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో తన బ్యాటింగ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం తన బ్యాటింగ్‌లో సమస్య ఎక్కడ ఉందో తెలియదన్నాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. తన కెరీర్, ఫామ్ గురించి మీడియాతో పంచుకున్నాడు.
"నా ఆట ఎక్కడ ఉందో నాకు తెలుసు. ఎత్తుపల్లాలను ఎదుర్కొనే సామర్థ్యం లేకపోతే.. అంతర్జాతీయ కెరీర్లో ఇంత కాలంపాటు ప్రయాణించలేరు. నేను ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేను ఆ దశను దాటి వచ్చాను. 2014 ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆఫ్ సైడ్ పడ్డ బంతులను ఆడటమే నా సమస్య అని తెలుసు. కానీ, ఇప్పుడు సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుందో చూపించగలిగే ఒక్క కారణం లేదు. నేను ఒక్కసారి బ్యాటింగ్ బాగా చేస్తే చాలు.. తిరిగి ఫామ్‌లోకి వస్తాను. నేను నిలకడగా ఆడతానని తెలుసు, ఆడగలను కూడా. అలాంటి గడ్డు పరిస్థితిని తిరిగి తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. దాని నుంచి నేర్చుకుంటాను. ఒక క్రీడాకారుడిగా, మనిషిగా విలువలను నేర్చుకుంటాను."
-విరాట్ కోహ్లీ, భారత మాజీ కెప్టెన్
విరాట్ కోహ్లీ చివరిసారిగా జులైలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లో పాల్గొన్నాడు. ఈ సిరీస్‌లోని రెండు వన్డేల్లో 16, 17.. రెండు టీ20ల్లో 1, 11 పరుగులు సాధించాడు. ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు విశ్రాంతినిచ్చారు. కోహ్లీ 2019 నవంబర్‌లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేశాడు.
ఇవీ చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, భారత్ పాక్ మ్యాచ్ టికెట్స్ రిలీజ్