బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్ కునెమెన్ బౌలింగ్‌లో విరాట్ బొటనివేలికి గాయమైంది. అసలేం జరిగిందంటే?
మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ నుంచి ఫ్యాన్స్ కాస్త గట్టిగానే ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇదే మ్యాచులో మళ్లీ స్పిన్నర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అయితే కునెమాన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓ షాట్ ఆడుతూ కోహ్లీ బొటనవేలికి గాయమైంది. దీంతో ఫిజియో వచ్చి అతడి వేలికి కట్టు కట్టాడు. ఇది జరిగిన కాసేపటికే అంటే నాలుగు పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటై పెవిలియన్‌కు చేరాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ గాయం చిన్నదా పెద్దదా అనేది తెలియాల్సి ఉంది.
-
#ViratKohli𓃵 #BGT2023 #INDvsAUS pic.twitter.com/qRI9dV6OUa
— Sayyad Nag Pasha (@nag_pasha) March 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#ViratKohli𓃵 #BGT2023 #INDvsAUS pic.twitter.com/qRI9dV6OUa
— Sayyad Nag Pasha (@nag_pasha) March 2, 2023#ViratKohli𓃵 #BGT2023 #INDvsAUS pic.twitter.com/qRI9dV6OUa
— Sayyad Nag Pasha (@nag_pasha) March 2, 2023
మరోవైపు, ఈ మ్యాచ్‌లోనే ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా గాయపడ్డాడు. రక్తం కారుతున్నా బౌలింగ్ కొనసాగించాడు. ఆటపై తన అంకితభావాన్ని ప్రదర్శించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.