Virat Kohli Fitness Diet : భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ అంటే విరాట్ కోహ్లీ గుర్తుకు వస్తాడు. ఈ సారి వన్డే వరల్డ్‌కప్‌లో భీకరఫామ్‌ను అందుకొన్న అతడు.. 5 మ్యాచ్‌ల్లో ఏకంగా 354 పరుగులు సాధించాడు. వీటిల్లో ఓ సెంచరీ కూడా ఉంది. టీమ్ ఇండియాలో టాప్ స్కోరర్ కోహ్లీనే. విరాట్ ఆటతీరులో కొన్ని ట్రేడ్ మార్క్ రన్స్ ఉంటున్నాయి. అతడు ఇన్నింగ్స్‌లో వికెట్ల మధ్య వేగంగా సింగిల్స్, డబుల్స్ చేస్తూ.. స్కోర్ బోర్డును ఉరకలెత్తిస్తున్నాడు. అవే అతడ్ని పరుగుల యంత్రంగా మార్చేశాయి. అలా కనీసం రెండు గంటలు క్రీజులో నిలబడాలన్నా చాలా ఫిట్‌నెస్ కావాలి. దీనిలో డైట్‌దే కీలక పాత్ర ఉంటుంది. తాజా ప్రపంచకప్ కోసం ప్రత్యేకమైన డైట్‌ను ఫాలో అవుతున్నాడట కోహ్లీ.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఈ విషయాన్ని వెల్లడించారు లీలా ప్యాలెస్ హోటల్ ఎగ్జిక్యుటీవ్ చెఫ్ అన్షుమాన్ బాలి. లీలా ప్యాలెస్ హోటల్‌లో టీం ఇండియా బస చేసింది. "విరాట్ కోహ్లీ ప్రస్తుతం మాంసాహారం తినడంలేదు. ఎక్కువగా ఉడకబెట్టిన ఆహారం తినేందుకు ఇష్టపడుతున్నాడు. కాయగూరలతో చేసిన డిమ్‌సుమ్ అనే చైనీస్ డిష్ తీసుకుంటున్నాడు. దాంతోపాటు ప్రొటీన్ కోసం మాక్ మీట్, టోఫు వంటివి తింటున్నాడు. ఇక వీలైనంత తక్కువగా పాల పదార్థాలను విరాట్ తీసుకొంటున్నాడు" అని బాలి వెల్లడించారు. ఇక రాగి దోశను టీమ్ ఇండియా అత్యంత ఇష్టంగా తింటోందని ఆయన చెప్పారు. తమ హోటల్‌లో చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీలు, క్వినోవాతో చేసిన ఇడ్లీలు అందుబాటులో ఉంచినట్లు ఆయన వివరించారు. ఇవి మంచి ప్రొటీన్ అందించే ఆహారాలని ఆటగాళ్లకు తెలుసని బాలి పేర్కొన్నారు.
'అవన్నీ నేను పట్టించుకోను.. నా సక్సెస్ మంత్ర అదే'..
Virat Kohli Success Mantra : రీసెంట్గా ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్‌స్పోర్ట్స్‌తో చిట్‌చాట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ చిట్‌చాట్‌లో తను నమ్మకంతో ఆచరించే నినాదం ఒకటుందని అన్నాడు. అత్యున్నత స్థాయికి చేరుకున్నాని ఎప్పుడూ భావించనని.. స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు రోజూ కష్టపడతానని విరాట్ పేర్కొన్నాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Most Searched Asian : గూగుల్‌లో సెర్చ్‌లోనూ కోహ్లీనే కింగ్.. వాళ్లిద్దరిని వెనక్కినెట్టి మరీ..