ETV Bharat / sports

చరిత్ర తిరగరాసిన 'విరాట్' - 50వ సెంచరీతో సచిన్ రికార్డ్​ బ్రేక్ - virat kohli sachin record

Virat Kohli 50th ODI Century : 2023 వరల్డ్​కప్ సెమీస్​లో టీమ్ఇండియా బ్యాటర్ విరాట్.. వన్డే కెరీర్​లో 50వ శతకం నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్​గా నిలిచాడు విరాట్.

Virat Kohli 50th ODI Century
Virat Kohli 50th ODI Century
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 5:08 PM IST

Updated : Nov 15, 2023, 6:02 PM IST

Virat Kohli 50th ODI Century : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్​లో 50వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్​తో జరుగుతున్న సెమీస్​ మ్యాచ్​లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు సచిన్ (49)ను అధిమించాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్​గా నిలిచాడు విరాట్. ఇక సెంచరీ అనంతరం స్టాండ్స్​లో ఉన్న సచిన్​కు అభివాదం చేశాడు విరాట్. ఇక 117 వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్.. భారీ షాట్​కు ప్రయత్నించి క్యాచౌట్​గా పెవిలియన్ చేరాడు. విరాట్ ఈ మైలురాయి అందుకోవడం పట్ల పలువురు మాజీలు, సెలెబ్రిటీలు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్​లో విరాట్ అందుకున్న మరికొన్ని ఘనతలు.

  • సింగిల్ వరల్డ్​కప్ ఎడిషన్​లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్​గా విరాట్ (711) రికార్డుకొట్టాడు. ఈ క్రమంలో విరాట్.. సచిన్​ (673)ను అధిగమించాడు.
  • విరాట్ ఈ ప్రపంచకప్​లో 8 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఒకే వరల్డ్​కప్ ఎడిషన్​లో ఎక్కువ హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్​గా నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డు సచిన్ (7) పేరిట ఉండేది.
  • ఈ ఇన్నింగ్స్​తో విరాట్ వన్డే కెరీర్​లో 13794 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్​లో సచిన్ (18426), కుమార సంగక్కర (14234) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
  • ఈ వరల్డ్​కప్​లో విరాట్​ కోహ్లీకి ఇది 3వ సెంచరీ. ఓవరాల్​గా ప్రపంచకప్​లో 5వ శతకం.

వన్డేల్లో అత్యధిక సెంచరీలు

  • విరాట్ కోహ్లీ (భారత్) - 50
  • సచిన్ తెందూల్కర్ (భారత్) - 49
  • రోహిత్ శర్మ (భారత్) - 31
  • రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 30
  • సనత్ జయసూర్య (శ్రీలంక) - 28

వరల్డ్​కప్​లో అత్యధిక సెంచరీలు

సెంచరీలతో చెలరేగిన విరాట్, అయ్యర్ - కివీస్ ముందు భారీ లక్ష్యం

శతకం పూర్తి చేసిన అయ్యర్ - టోర్నీలో బ్యాక్​ టు బ్యాక్ సెంచరీ

Last Updated : Nov 15, 2023, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.