Virat Kohli 500 : ఈ తరం క్రికెట్ లవర్స్‌కు విరాట్ కోహ్లీ అనేది ఓ పేరు కాదు ఓ ఎమెషన్. అతను క్రీజులోకి దిగాడంటే ఇక స్టేడియం మొత్తం కోహ్లీ పేరుతో మారుమోగిపోవాల్సిందే. తన బ్యాటింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్న ఈ రన్నింగ్ మెషిన్ బరిలోకి దిగాడంటే ఇక బాల్‌ను అలవోకగా బౌండరీని దాటిస్తాడు. అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్‌లోకి అరంగేట్రం చేసిన ఈ ప్లేయర్.. ఆ తర్వాత ఆడిన అన్నీ ఫార్మాట్లలో అదరగొట్టాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు సారధ్యం వహించిన .. అక్కడ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఆడుతూ వస్తున్నాడు. ఇక టెస్ట్ క్రికెట్లో కూడా మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఈతరం ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడిన కింగ్ కోహ్లీ.. 20 వేలకుపైగా పరుగులు సాధించాడు.
India Vs Westindies : ఇక గురువారం వెస్టిండీస్‌తో తలపడేందుకు క్రీజులో దిగనున్న కింగ్ కోహ్లీ.. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. తాజాగా జరిగిన విండీస్ తొలి టెస్టులో సెంచరీ చేయడంలో విఫలమైనప్పటికీ 76 పరుగులతో మంచి ఫామ్‌ను ప్రదర్శించాడు. తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా కింగ్ కోహ్లీకి కంగ్రాజ్యూలేషన్స్ చెబుతూ.. టీమ్ఇండియా మాజీలు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్, ప్రగ్యాన్ ఓజాలు అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. బీసీసీఐ కూడా ప్రత్యేకంగా పోస్టర్‌ను రూపొందించి ట్విటర్‌లో షేర్ చేసింది.
"క్రికెట్ పట్ల విరాట్ కోహ్లికి ఉన్న అంకితభావం ఎంతో మనందరికీ తెలుసు. తన జీవితం మొత్తం విరాట్ ఓ సన్యాసిలా గడిపాడు. అతని జీవితం మొత్తం క్రికెటే. ఆ కారణం వల్లే అతడు ఈ స్థాయికి చేరాడు. ఈ అందమైన ఆటకు అతడు బ్రాండ్ అంబాసిడర్. ఇండియన్ క్రికెట్ అనే కాదు క్రికెట్ కు కూడా అతడు చేసిన సేవలను అందరం రుణపడి ఉంటాం" అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.
"క్రీడా జీవితంలో ఇదొక ప్రత్యేక ఘనత. చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి ఘనతను సాధిస్తారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఇన్నింగ్స్‌లను ఆడతాడని ఆశిద్దాం. స్ఫూర్తితో ముందుకు సాగుతూ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాలి" అని ప్రజ్ఞాన్ ఓజా అన్నారు.
-
500 reasons to admire the journey!
— BCCI (@BCCI) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to Virat Kohli on his 5️⃣0️⃣0️⃣th international match for #TeamIndia 🇮🇳🫡#WIvIND | @imVkohli pic.twitter.com/Y9lez80Q97
">500 reasons to admire the journey!
— BCCI (@BCCI) July 20, 2023
Congratulations to Virat Kohli on his 5️⃣0️⃣0️⃣th international match for #TeamIndia 🇮🇳🫡#WIvIND | @imVkohli pic.twitter.com/Y9lez80Q97500 reasons to admire the journey!
— BCCI (@BCCI) July 20, 2023
Congratulations to Virat Kohli on his 5️⃣0️⃣0️⃣th international match for #TeamIndia 🇮🇳🫡#WIvIND | @imVkohli pic.twitter.com/Y9lez80Q97
"ప్రతి ఒక్కరూ అంతర్జాతీయంగా 500 మ్యాచ్‌లు ఆడలేరు. ఇలాంటి ఘనత సాధించడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే. నిరంతరం తన పరుగుల దాహం తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఫిట్‌నెస్ మంత్ర అతడి స్పెషాలిటీ. ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్‌లో 75 సెంచరీలు బాదడమంటే సాధారణ విషయం కాదు. అతడి క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పం అద్భుతం. ప్రస్తుతం 500 మ్యాచ్‌ల మైలురాయిని అందుకోనున్న విరాట్ కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా యువ ఆటగాళ్లకు అతడు ఆదర్శ క్రికెటర్" అంటూ జాఫర్ కొనియాడారు.