Virat Kohli 49th Century : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. కెరీర్లో అద్భుతమైన మైలురాయి అందుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ (100 పరుగులు ; బంతుల్లో 10x4) శతకంతో అదరగొట్టాడు. ఈ క్రమంలో అతడు తన వన్డే కెరీర్లో 49వ సెంచరీ నమోదు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సరసన చేరాడు. తన బర్త్ డే రోజున ఈ ఘనత సాధించడం వల్ల విరాట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసం జల్లు కురిపిస్తున్నారు.
సచిన్ తెందూల్కర్ ట్వీట్.. వెల్ ప్లే విరాట్.. " నాకు 49 నుంచి 50 చేరుకోడానికి (వయసును ఉద్దేశిస్తూ) 365 రోజులు పట్టింది. కానీ, నువ్వు త్వరలోనే 49 నుంచి 50కి (వన్డేల్లో సెంచరీలు ఉద్దేశించి) చేరుకొని నా రికార్డు బ్రేక్ చెయ్యాలి" అని తెందూల్కర్ ట్వీట్ చేశాడు.
-
Well played Virat.
— Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFk
">Well played Virat.
— Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023
It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFkWell played Virat.
— Sachin Tendulkar (@sachin_rt) November 5, 2023
It took me 365 days to go from 49 to 50 earlier this year. I hope you go from 49 to 50 and break my record in the next few days.
Congratulations!!#INDvSA pic.twitter.com/PVe4iXfGFk
వన్డేల్లో అత్యధిక సెంచరీలు
- విరాట్ కోహ్లీ 49 (277 ఇన్నింగ్స్)
- సచిన్ తెందూల్కర్ 49 (452 ఇన్నింగ్స్)
- రోహిత్ శర్మ 31 (251 ఇన్నింగ్స్)
- రికీ పాంటింగ్ 30 (365 ఇన్నింగ్స్)
- సనత్ జయసూర్య 28 (433 ఇన్నింగ్స్)
పుట్టినరోజున సెంచరీలు బాదిన క్రికెటర్లు..
- వినోద్ కాంబ్లి 100 vs ఇంగ్లాండ్ (1993)
- సచిన్ తెందూల్కర్ 134 vs ఆస్ట్రేలియా (1998)
- సనత్ జయసూర్య 130 vs భారత్ (2008)
- రాస్ టేలర్ 131 vs పాకిస్థాన్ (2011)
- మిచెల్ మార్ష్ 121 vs పాకిస్థాన్ (2023)
- విరాట్ కోహ్లీ 101 vs సౌతాఫ్రికా (2023)
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో.. వన్డేల్లో విరాట్ ఇప్పటివరకు 49 సెంచరీలు బాదాడు. మరొక్క శతకం నమోదు చేస్తే వన్డేల్లో 50 సెంచరీలు బాదిక ఏకైక క్రికెటర్‌గా విరాట్ చరిత్ర సృష్టిస్తాడు. అయితే ఈ అరుదైన ఘనతకు కేవలం ఒకే సెంచరీ దూరంలో ఉండడం వల్ల.. విరాట్ ఈజీగా సాధించే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటివరకు విరాట్ తన కెరీర్లో 289 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 58.48 సగటుతో 13626 పరుగులు సాధించాడు. ఇందులో 49 శతకాలు, 70 అర్ధ శతకాలు ఉన్నాయి.
-
𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 in Kolkata for the Birthday Boy! 🎂🥳
— BCCI (@BCCI) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
From scoring his Maiden century in Kolkata to scoring his 4⃣9⃣th ODI Ton 👑💯#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/pA28TGI4uv
">𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 in Kolkata for the Birthday Boy! 🎂🥳
— BCCI (@BCCI) November 5, 2023
From scoring his Maiden century in Kolkata to scoring his 4⃣9⃣th ODI Ton 👑💯#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/pA28TGI4uv𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 in Kolkata for the Birthday Boy! 🎂🥳
— BCCI (@BCCI) November 5, 2023
From scoring his Maiden century in Kolkata to scoring his 4⃣9⃣th ODI Ton 👑💯#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/pA28TGI4uv
ఆ రికార్డ్‌కు నాకు ఏడాది పట్టింది నువ్వు త్వరగా చేయగలవా? - కోహ్లీ 49వ సెంచరీపై సచిన్ ట్వీట్
7అడుగుల ఎత్తు, 5టన్నుల ఇసుక- విరాట్ కోహ్లీ సైకత శిల్పం అదుర్స్!