ETV Bharat / sports

కోహ్లీ సూపర్​ రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా

Kohli insta 200 millions: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. ఇన్​స్టాలో 200మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి భారతీయుడుగా నిలిచాడు.

virat kohli 200 instagram
కోహ్లీ 200 మిలియన్స్​ ఇన్​స్టా
author img

By

Published : Jun 8, 2022, 10:54 AM IST

Kohli insta 200 millions: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ మరో సూపర్​ రికార్డు సాధించాడు. అయితే ఈ సారి మైదానంలో కాకుండా సోషల్​మీడియాలో. ఇన్​స్టాగ్రామ్​లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్​స్టాలో 200 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి భారతీయ వ్యక్తిగా నిలిచాడు. ప్రపంచంలోని క్రీడాకారుల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. తొలి రెండు స్థానాల్లో స్టార్​ ఫుట్​బాలర్స్​​ క్రిస్టియానో రొనాల్డో(451), లియోనల్​ మెస్సీ(334) కోహ్లీ కన్నా ముందు ఉన్నారు. తనను 200 మిలియన్ల మంది ఫాలో అవుతుండటంపై హర్షం వ్యక్తం చేశాడు కోహ్లీ. అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత పొట్టి ఫార్మాట్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన కోహ్లీని... ఆ తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది. ఇక దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ ఘోర పరాజయం నేపథ్యంలో టెస్టు సారథ్య బాధ్యతల నుంచి విరాట్​ తప్పుకొన్నాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ దక్కగా.. కోహ్లీ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి: అది భారత జట్టుకు కూడా ప్రయోజనమే: ద్రవిడ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.