ETV Bharat / sports

రజనీ స్టైల్లో వెంకటేశ్​ అయ్యర్​.. 'సెంచరీ' సెల్యూట్! - విజయ్ హజారే ట్రోఫీ

Venkatesh Iyer Rajini: తలైవా​ రజనీకాంత్​కు స్పెషల్​గా బర్త్​డే విషెస్​ చెప్పాడు టీమ్​ఇండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్. విజయ్​ హజారే ట్రోఫీలో చంఢీగఢ్​ జట్టుపై సెంచరీ చేసిన తర్వాత రజనీ స్టైల్​లో సెల్యూట్​ చేశాడు.

venkatesh iyer
వెంకటేష్ అయ్యర్
author img

By

Published : Dec 12, 2021, 4:18 PM IST

Venkatesh Iyer Rajini: సూపర్​స్టార్ రజనీకాంత్​కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోనూ ఆయనకు చాలామంది అభిమానులున్నారు. అయితే రజనీకాంత్ ఆదివారం 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టీమ్​ఇండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్​ రజనీకి స్పెషల్​గా బర్త్​డే విషెస్​ చెప్పి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

విజయ్​ హజారే ట్రోఫీ టోర్నీలో మధ్యప్రదేశ్​ జట్టుకు ఆడుతున్న వెంకటేశ్.. తన మెరుగైన ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలతో దుమ్మురేపాడు. చంఢీగఢ్ జట్టుపై 151 పరుగులు చేసిన అయ్యర్​.. సెంచరీ అనంతరం రజనీ స్టైల్​లో సెల్యూట్​ చేశాడు. రజనీ తన సినిమాల్లో అద్దాలు పెట్టుకునే విధానాన్ని చేసి చూపించాడు.

రజనీ వీరాభిమాని..

రజనీకి వీరాభిమానినని గతంలో వెంకటేశ్​ అయ్యర్​ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సూపర్​స్టార్​ ప్రతి సినిమా చూస్తాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రజనీ పుట్టినరోజు సందర్భంగా తనదైన శైలిలో ఆయనకు విషెస్​ చెప్పాడు అయ్యర్.

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుకు ఆడుతున్న అయ్యర్.. ఈ సీజన్​లో పరుగుల వరద పారించాడు. జట్టును ఫైనల్​కు వెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత భారత టీ20 జట్టులోనూ చోటు సంపాదించాడు.

ఇదీ చదవండి:

పాండ్యా గాయపడతాడని ముందే చెప్పా: అక్తర్

IND vs SA Series: టీమ్ఇండియా దక్షిణాఫ్రికా ప్రయాణం అప్పుడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.