ETV Bharat / sports

క్షేమంగా ఇళ్లకు చేరిన దేశవాళీ, విదేశీ క్రికెటర్లు - క్షేమంగా ఇంటికి చేరిన సందీప్ వారియర్

ఐపీఎల్​లో పాల్గొన్న దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. తాజాగా కోల్​కతా ఆటగాళ్లు వరుణ్​ చక్రవర్తి, సందీప్​ వారియర్​తో పాటు విండీస్​ క్రికెటర్లు తమ ఇళ్లకు సురక్షితంగా వెళ్లారు.

Varun Chakravarthy, Sandeep Warrier back home after completing mandatory isolation
క్షేమంగా ఇళ్లకు చేరిన దేశవాళీ, విదేశీ క్రికెటర్లు
author img

By

Published : May 10, 2021, 1:28 PM IST

ఐపీఎల్​లో తొలి కొవిడ్​ కేసులుగా నమోదైన కోల్​కతా ఆటగాళ్లు వరుణ్​ చక్రవర్తి, సందీప్ వారియర్​.. క్షేమంగా వారి ఇళ్లకు చేరుకున్నారు. పది రోజుల తప్పనిసరి ఐసోలేషన్​​ను పూర్తి చేసుకున్న వీరిద్దరూ.. ఇళ్లకు చేరినట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.

మెడికల్​ స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రులకు వెళ్లిన చక్రవర్తికి కొవిడ్ నిర్ధరణ అయింది. అతని ద్వారా సందీప్ వారియర్, ప్రసిధ్ కృష్ణ కరోనా బారిన పడ్డారు. దిల్లీ క్యాపిటల్స్​ స్పిన్నర్ అమిత్​ మిశ్రాను వారియర్​ కలిశాడు. దీంతో అతనికి వైరస్​ సోకింది. దీంతో లీగ్​ను నిరవధిక వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

పది రోజుల తప్పనిసరి ఐసోలేషన్​ను పూర్తి చేసుకున్న వరుణ్​ చక్రవర్తి, సందీప్​ వారియర్..​ వారి సొంత గ్రామాలకు చేరుకున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని కోల్​కతా ఫ్రాంఛైజీ పర్యవేక్షించిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.
మరో కోల్​కతా నైట్ రైడర్స్​ ఆటగాడు టిమ్​ సీఫెర్ట్​ ప్రస్తుతం తప్పనిసరి ఐసోలేషన్​లో ఉన్నాడు.

విండీస్ క్రికెటర్లు కూడా..

ఐపీఎల్​లో పాల్గొన్న 9 మంది విండీస్​ క్రికెటర్లు క్షేమంగా స్వదేశానికి చేరినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ జానీ గ్రేవ్​ స్పష్టం చేశారు. వారు సురక్షితంగా ఇళ్లకు చేరడానికి తగిన ఏర్పాట్లు చేసిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపారు గ్రేవ్​.
కీరన్ పొలార్డ్, జేసన్ హోల్డర్​, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, డ్వేన్ బ్రేవో, నికోలస్ పూరన్, శిమ్రాన్​ హెట్మేయర్, ఫాబియన్ అలెన్.. తాజాగా వాయిదా పడిన లీగ్​లో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.