Vanitha Retirement: భారత జట్టు మహిళా క్రికెటర్ వీఆర్ వనిత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 31ఏళ్ల వనిత తన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియాతో తన ప్రయాణం గురించి ట్వీట్ చేసింది. ఈ జర్నీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.
-
And this lovely innings comes to an END ! pic.twitter.com/ZJw9ieXHSO
— Vanitha VR || ವನಿತಾ.ವಿ.ಆರ್ (@ImVanithaVR) February 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">And this lovely innings comes to an END ! pic.twitter.com/ZJw9ieXHSO
— Vanitha VR || ವನಿತಾ.ವಿ.ಆರ್ (@ImVanithaVR) February 21, 2022And this lovely innings comes to an END ! pic.twitter.com/ZJw9ieXHSO
— Vanitha VR || ವನಿತಾ.ವಿ.ಆರ್ (@ImVanithaVR) February 21, 2022
19ఏళ్ల క్రితం ఆటను మొదలు పెట్టినప్పుడు నేను చిన్న అమ్మాయిని. నేటికీ క్రికెట్‌పై నా ప్రేమ అలాగే ఉంది. అయితే దిశ మారుతోంది. నా మనసు ఆట కొనసాగించమని చెప్పగా.. శరీరం వద్దని చెబుతోంది. నేను రెండోది వినాలని నిర్ణయించుకున్నాను. అందుకే అన్ని క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఇది పోరాటాలు, సంతోషం, ఇబ్బందులు, అభ్యాసాలతో కూడుకున్న ప్రయాణం. కొన్నింటికి పశ్చాత్తాప పడుతున్నప్పటికీ.. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు ధన్యురాలిని" అని వనిత పోస్ట్‌లో పేర్కొన్నారు.
దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక, బెంగాల్ జట్లకు ఆడిన వనిత.. 2014 జనవరిలో భారత జట్టులో చోటు దక్కించుకుంది. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20 ఆడిన ఆమె మొత్తం 300కుపైగా పరుగులు చేసింది.
ఇదీ చూడండి: Suresh Raina CSK: రైనాకు సీఎస్కే భావోద్వేగ వీడ్కోలు