జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ అందరికీ సుపరిచతమే. ఏకంగా ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. అయితే అథ్లెట్‌గా రిటైర్ అయిన బోల్ట్ త్వరలోనే క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలో ఓ ప్రతిష్టాత్మక లీగ్‌లో ఉసేన్ ఆడనున్నాడు. విశేషం ఏమిటంటే.. అతడు క్రికెట్ ఆడేది ఇండియాలోనే.
ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ పవర్ స్పోర్ట్స్ర్ ఆధ్వర్యంలో జరగనున్న గ్లోబల్ టీ20 లీగ్‌లో అతడు ఆడనున్నాడు. దిల్లీ.. ఈ లీగ్‌కు వేదిక కానుంది. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో ప్రపంచ దేశాల నుంచి 8 జట్లు పాల్గొనబోతున్నాయి. మొదటి ఎడిషన్ ఇండియాలో జరపనున్న నిర్వాహకులు ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూఎస్‌ఏ, కెనడా, సౌతాఫ్రికా దేశాల్లో గ్లోబల్ పవర్ క్రికెట్ లీగ్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు.
కాగా, లీగ్‌లో పాల్గొననున్న ఎనిమిది జట్లకు ఇండియన్ సప్పైర్స్, ఆస్ట్రేలియాన్ గోల్డ్స్, ఇంగ్లీష్ రెడ్స్, అమెరికన్ ఇండిగోస్, ఐరిష్ ఓలివ్స్, స్కాటిష్ మల్బేరీస్, సౌతాఫ్రికా ఎమెరాల్డ్స్, శ్రీలంక వైలెట్స్ అని పేర్లు పెట్టారు. మరి విషయమేమిటంటే.. ఉసేన్ బోల్ట్‌తో పాటు మునాఫ్ పటేల్, యూసపఫ్ పఠాన్, గుల్భాద్దిన్ నైబ్, ఏంజెలో మాథ్యూస్,ఇయాన్ బెల్ వంటి మాజీ క్రికెటర్లు కూడా గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్‌లో ఆడనున్నారు.
ఇదీ చూడండి: ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్.. ఇకపై మ్యాచ్ మధ్యలో..