ETV Bharat / sports

క్రికెట్​ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఏకంగా 515 భారీ స్కోర్​.. 450 పరుగుల తేడాతో విజయం.. - అమెరికా వర్సెస్ అర్జెంటినా రికార్డు

USA Under 19 Vs Argentina U19 Record : ప్రపంచ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. అండర్​-19 పరుఘల వరల్డ్​ కప్​లో అర్జెంటినాపై 450 పరుగుల భారీ తేడాతో అమెరికా జట్టు విజయం సాధించింది.

USA Under 19 Vs Argentina U19 Record
USA Under 19 Vs Argentina U19 Record
author img

By

Published : Aug 15, 2023, 10:17 PM IST

USA Under 19 Vs Argentina U19 Record : అండర్‌-19 పురుషుల ప్రపంచకప్​లో అమెరికా క్వాలిఫయర్‌ టోర్నీలో సంచలనం నమోదైంది. అర్జెంటీనా అండర్‌-19 జట్టుపై అమెరికా యువ జట్టు.. 450 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టొరొంటో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అత్యంత భారీ స్కోర్‌ చేసింది. అండర్‌-19 క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం.

అయితే ఇప్పటివరకు, 2002లో ఆసీస్​ అండర్‌-19 జట్టు.. కెన్యాపై చేసిన 430 పరుగులే.. అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డైంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో అమెరికా.. ఆసీస్‌ రికార్డును బ్రేక్‌ చేసింది. దీంతో అండర్‌-19 వన్డే ఫార్మాట్‌లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. ఓవరాల్‌గా లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా యూఎస్‌ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోర్‌ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు రికార్డు స్థాయిలో 506 పరుగులు బాదింది.

ఇదే అతిపెద్ద విజయం..
అమెరికా నిర్దేశించిన 516 పరుగుల భారీ టార్గెట్​ను ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటినా.. పేసర్‌ ఆరిన్‌ నాదకర్ణి ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. అయితే ఇప్పటివరకు ఉన్న అత్యంత భారీ తేడాతో ఓడిపోయిన రికార్డు 430 పరుగులుగా ఉంది. 2002లో ఆసీస్​, కెన్యా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్​లో ఆసీస్‌ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక దీనికి ముందు వరకు లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అరుణాచల్​తో జరిగిన మ్యాచ్​లో తమిళనాడు 435 పరుగులతో అతి భారీ విజయం సాధించింది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భవ్య మెహతా (136), రిషి రమేశ్‌ (100) సెంచరీలు బాదారు. ప్రణవ్‌ చట్టిపలాయమ్‌ (61), అర్జున్‌ మహేశ్‌ (67) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. యూఎస్‌ఏ టీమ్‌ రికార్డు స్కోర్‌ చేసింది. యూఎస్‌ఏ టీమ్‌లో అమోఘ్‌ ఆరేపల్లి (48), ఉత్కర్ష్‌ శ్రీవత్సవ (45) కూడా రాణించాడు. భారీ టార్గెట్​ను ఛేదించేందుకు అర్జెంటినా చేతులెత్తేసింది. అర్జెంటీనా 19.5 ఓవర్లలో కేవలం 65 పరుగులకే ఆలౌటైంది. నాదకర్ణితో పాటు ఆర్యన్‌ సతీశ్‌ (2), పార్థ్‌ పటేల్‌, ఆర్యన్‌ బత్రా ఒక్కో వికెట్​ పడగొట్టారు. అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో థియో (18) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

క్రికెట్ వ్యాపారంలోకి సత్య నాదెళ్ల.. ఐపీఎల్​ వైపు చూస్తారా..?

టీ20 ప్రపంచకప్​ ఆతిథ్యానికి అమెరికా రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.