ETV Bharat / sports

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆ జట్ల మధ్య వన్డే సిరీస్ రద్దు - యూఎస్ఏ-ఐర్లాండ్ వన్డే సిరీస్ రద్దు

US Ireland ODI: కరోనా కారణంగా యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి ఇరుజట్లు.

US Ireland OdI series canceled, యూఎస్-ఐర్లాండ్ సిరీస్ రద్దు
US Ireland
author img

By

Published : Dec 29, 2021, 2:38 PM IST

US Ireland ODI: కరోనా మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ పలు దేశాల్లో విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే పలు సిరీస్​లు వాయిదా పడ్డాయి. తాజాగా యూఎస్ఏ-ఐర్లాండ్ మద్య జరగాల్సిన వన్డే సిరీస్​ను రద్దు చేస్తున్నట్లు ఇరుబోర్డులు ప్రకటించాయి.

"ఇప్పటికే నిర్ణయించిన యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దు చేస్తున్నాం. ఈ విషయం తెలిపేందుకు ఎంతో బాధగా ఉంది" అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు అధికారులు.

ఇప్పటికే ఐర్లాండ్ జట్టు సహాయ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇరుజట్ల ఆటగాళ్లకు మాత్రం నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. కానీ ముందు జాగ్రత్త చర్యల నిమిత్తం ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని ఈ టోర్నీని రద్దు చేశారు.

ఇరుజట్ల మధ్య జరగాల్సిన మొదటి వన్డే ఇప్పటికే రద్దయింది. రెండో, మూడో వన్డేలు బుధవారం, గురువారం జరగాల్సి ఉన్నాయి. కానీ మహమ్మరి కారణంగా ఈ మ్యాచ్​లను రద్దు చేస్తున్నట్లు ఇరుజట్లు ప్రకటించాయి.

కాగా, ఐర్లాండ్‌ జట్టు డిసెంబరు 31న వెస్టిండీస్‌ పర్యటనకు బయల్దేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన సహాయక సిబ్బంది ఐసోలేషన్‌ పూర్తి చేసుకుని, పూర్తిగా కోలుకున్న తర్వాత జట్టుతో చేరనున్నారు.

ఇవీ చూడండి: 'భారత్​ను వారి గడ్డపైనే ఓడించాలి.. అదే నా కోరిక'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.