ఐపీఎల్ రెండో దశ టోర్నీలో(IPL 2021) తాను ఆడకపోవచ్చని తెలిపాడు ఇంగ్లాండ్ వికెట్ కీపర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్. జాతీయ జట్టుకు ఉన్న షెడ్యూల్ కారణంగా లీగ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాడు.
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ను దుబాయ్ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు బంగ్లాదేశ్, పాకిస్థాన్ టూర్‌కు వెళ్లనుంది. పొట్టి ప్రపంచకప్‌కు ముందు ఈ పర్యటనను ప్రాక్టీస్ మ్యాచ్ల్లాగా భావిస్తోంది. టీ20 వరల్డ్‌కప్ భారత్‌లో జరగనున్న నేపథ్యంలో భారత్ పరిస్థితులకు దగ్గరగా ఉన్న ఈ రెండు దేశాలలో సిరీస్‌లు ఆడాలని నిర్ణయించింది ఇంగ్లాండ్.
ఐపీఎల్లో వరుస కొవిడ్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో లీగ్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. ఈ టోర్నీలో పాల్గొన్న బట్లర్‌ను.. ఇటీవల కివీస్‌తో జరిగిన సిరీస్‌కు పక్కన పెట్టింది ఇంగ్లాండ్. తదుపరి భారత్‌తో జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోనైనా చోటు దక్కుతుందని ఆశిస్తున్నాడు.
ఇదీ చదవండి: