కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటికే ఐపీఎల్లో పలువురు ఆటగాళ్లు మెగాలీగ్ నుంచి వీడారు. ఇప్పుడు మరో ఇద్దరు అంపైర్లు కూడా ఇదే బాట పట్టారు. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మేనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీఫెల్.. లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
తన కుటుంబం కరోనా బారిన పడటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు మేనన్. ఆసీస్ ప్రభుత్వం.. ప్రయాణ ఆంక్షలు విధించడం వల్ల వెళ్లిపోవాడనికి సిద్ధమయ్యాడు రీఫెల్. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, ఆండ్రూ టై, లియామ్ లివింగ్ స్టోన్, ఆడమ్ జంపా, కేన్ రిచార్డ్సన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు.
ఇదీ చూడండి.. ఐపీఎల్‌పై మోర్గాన్ అలా.. జంపా ఇలా!