వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్(Umar Akmal) ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాడు. తనను చూడటానికి వచ్చిన అభిమానులతో వాగ్వావాదానికి దిగాడట! ప్రస్తుతం ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఏం జరిగింది?
అక్మల్ తమ పక్క ఇంటికి వచ్చాడని తెలిసి నలుగురు అభిమానులు అతడి ఆటోగ్రాఫ్ కోసం అక్కడికి వెళ్లారు. ఏమైందో తెలీదుగానీ అతడికి వారికి మధ్య ఘర్షణ ఏర్పడి కొట్లాట వరకు వెళ్లింది. తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కేసు నమోదు చేసి ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా.. ఆ నలుగురే తనపై దాడిచేసి చంపుతానంటూ బెదరించారని అక్మల్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్మల్, తమతో అసభ్యపదజాలంతో మాట్లాడటం సహా తన సహాయక సిబ్బందితో కొట్టించాడని ఆ నలుగురు వాపోయారని సమాచారం. ప్రస్తుతం పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలతో గతేడాది ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధాన్ని విధించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). ఆ తర్వాత శిక్షకాలాన్ని 18 నెలలకు కుదించింది.
ఇదీ చూడండి: 'నాపై ఉన్న నిషేధాన్ని రద్దు చేయండి'