ఐపీఎల్ సమయంలో కరోనాబారిన పడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ ప్రసిధ్ కృష్ణ, వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కోలుకున్నారు. మే 4న మిశ్రాకు పాజిటివ్‌గా తేలగా, మే 8న ప్రసిధ్‌కు పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో వీరిద్దరూ ఇన్నిరోజులు ఐసోలేషన్‌లో ఉన్నారు.
ప్రసిధ్ కృష్ణకు నెగిటివ్ వచ్చినట్లుగా బీసీసీఐ అధికారి తెలపగా, తన ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశాడు మిశ్రా. "ఫ్రంట్‌లైన్ వర్కర్స్ నిజమైన హీరోలు. మీ అందరికీ మనస్ఫూర్థిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు, మీ కుటుంబం చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవి" అని మిశ్రా తెలిపాడు.
-
The real heroes. Our Frontline workers. All I can say post my recovery is, You have my support and heartfelt appreciation for all you do.
— Amit Mishra (@MishiAmit) May 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
We are deeply grateful to you for all the sacrifices that you and your family are making.
.#grateful #coronawarriors #bcci #DelhiCapitals pic.twitter.com/Wg3vbqd42j
">The real heroes. Our Frontline workers. All I can say post my recovery is, You have my support and heartfelt appreciation for all you do.
— Amit Mishra (@MishiAmit) May 18, 2021
We are deeply grateful to you for all the sacrifices that you and your family are making.
.#grateful #coronawarriors #bcci #DelhiCapitals pic.twitter.com/Wg3vbqd42jThe real heroes. Our Frontline workers. All I can say post my recovery is, You have my support and heartfelt appreciation for all you do.
— Amit Mishra (@MishiAmit) May 18, 2021
We are deeply grateful to you for all the sacrifices that you and your family are making.
.#grateful #coronawarriors #bcci #DelhiCapitals pic.twitter.com/Wg3vbqd42j
ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు ప్రసిధ్ కృష్ణ. అలాగే ఈ సీజన్లో కరోనా బారినపడిన నాలుగో కేకేఆర్ ఆటగాడు ఇతడు. ఇంతకుముందు ఈ జట్టుకు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, టిమ్ సీఫెర్ట్‌లకు వైరస్ సోకింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు ప్రసిధ్. ఈ పర్యటనలో పాల్గొననున్న ఆటగాళ్లు ముందుగా ముంబయిలో క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ప్రసిధ్‌కు కరోనా నెగిటివ్ రాగా అతడు కూడా క్వారంటైన్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఇతడి ఇంగ్లాండ్ పర్యటనకు మార్గం సుగమమైనట్లేనని తెలుస్తోంది.