ACC U19 Asia Cup 2023 India Squad : యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్- ఎసీసీ అండర్ 19 పురుషుల ఆసియా 2023 కప్‌నకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. పంజాప్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఉదయ్ సహారన్ను కెప్టెన్‌గా నియమించింది. ముగ్గురిని స్టాండ్‌బై ప్లేయర్లుగా తీసుకోగా.. మరో నలుగురిని రిజర్వ్ ప్లేయర్లుగా జట్టులోకి తీసుకుంది. అయితే టూరింగ్ కంటింజెంట్లో రిజర్వ్ ప్లేయర్లు లేరని స్పష్టం చేసింది.
అండర్ 19 ఆసియా కప్ భారత జట్టు : అర్షిన్ కులకర్ణి (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్), ఆదర్శ్ సింగ్ (ఉత్తరప్రదేశ్), రుద్ర మయూర్ పటేల్ (గుజరాత్), సచిన్ దాస్ (మహారాష్ట్ర), ప్రియాంషు మోలియా (బరోడా), ముషీర్ ఖాన్ (ముంబయి), ఉదయ్ సహారన్ (C) (పంజాబ్), ఆరవెల్లి అవనీష్ రావు (WK) (హైదరాబాద్), సౌమీ కుమార్ పాండే (VC) (మధ్యప్రదేశ్), మురుగన్ అభిషేక్ (హైదరాబాద్), ఇన్నేష్ మహాజన్ (WK) (హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ ), ధనుష్ గౌడ (కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్), ఆరాధ్య శుక్లా (పంజాబ్), రాజ్ లింబాని (బరోడా క్రికెట్ అసోసియేషన్), నమన్ తివారీ (ఉత్తరప్రదేశ్).
-
India has announced their squad for upcoming U19 Asia Cup, starting from 8th December.#TeamIndia #Cricket #Under19 #AsiaCup #Squad #SkyExch #udaysaharan pic.twitter.com/aqkAHbnZhd
— SkyExch (@officialskyexch) November 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">India has announced their squad for upcoming U19 Asia Cup, starting from 8th December.#TeamIndia #Cricket #Under19 #AsiaCup #Squad #SkyExch #udaysaharan pic.twitter.com/aqkAHbnZhd
— SkyExch (@officialskyexch) November 25, 2023India has announced their squad for upcoming U19 Asia Cup, starting from 8th December.#TeamIndia #Cricket #Under19 #AsiaCup #Squad #SkyExch #udaysaharan pic.twitter.com/aqkAHbnZhd
— SkyExch (@officialskyexch) November 25, 2023
స్టాండ్‌బై ప్లేయర్లు : ప్రేమ్ దేవ్కర్ (ముంబయి), అన్ష్ గోసాయి (సౌరాష్ట్ర), మహ్మద్ అమన్ (ఉత్తర్‌ప్రదేశ్ ).
రిజర్వ్ ప్లేయర్లు : దిగ్విజయ్ పాటిల్ (మహారాష్ట్ర), జయంత్ గోయత్ (హరియాణా), పి విఘ్నేశ్ (తమిళనాడు), కిరణ్ చోర్మలే (మహారాష్ట్ర).
ACC U19 Asia Cup 2023 Schedule : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్- యూఏఈలో డిసెంబర్ 8న ఏసీసీ అండర్-19 పురుఘల ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. ఇందులో రెండు గ్రూపుల నుంచి 8 టీమ్‌లు ( భారత, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక, జపాన్ ) పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లకు యూఏఈలోని ఐసీసీ అకడామీ ఓవల్-1 & 2 వేదిక కానున్నాయి. ఇక మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌ను దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం-డీఐఎస్, రెండోది ఐసీసీ అఖడామీ ఓవల్ 1లో నిర్వహిస్తారు. ఇక ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 17న డీఐఎస్లో జరుగనుంది. గత ఎడిషన్‌లో భారత్ విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఎనిమిది సార్లు అండర్ 19 ఆసియా కప్ సొంతం చేసుకుంది టీమ్ఇండియా.
భారత్ మ్యాచ్‌లు
- భారత్ x అఫ్గానిస్థాన్ - డిసెంబర్ 8
- భారత్ x పాకిస్థాన్ - డిసెంబర్ 10
- భారత్ x నేపాల్ - డిసెంబర్ 12
టీ20ల్లో సూర్యనే కింగ్ - పొట్టి ఫార్మాట్లో టాప్ 5 స్ట్రైక్ రేట్స్ ఇవే!
'విరాట్, రోహిత్ టీ20ల్లోనూ ఆడాలి - లేదంటే వారి ఫేర్వెల్ బాధ్యత హార్దిక్‌దే' : షోయబ్